సంస్కరణని ఇంటి దగ్గర నుంచే ప్రారంభించి క్రమంగా సమాజంలోనూ జరిగేట్టు చూడాలి అని చెప్పే గొప్ప కథానిక 'స్త్రీకారం'. స్త్రీ కేవలం అమ్మేకాదు అవసరమైతే ఆదిశక్తి అవతారం కూడా ఎత్తుతుందనే విషయాన్ని 'స్త్రీకారం' ద్వారా చెప్పారు రచయిత. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే ఆ ప్రొఫెసర్ ని సమాజం అంతా కూడా క్షమించగలదేమో కానీ ఇంట్లో తన చాటున మనుగడ సాగిస్తున్న భార్య ఎంత మాత్రం క్షమించకపోవడమే కాదు కీచక సంతతని మార్చాలనే అసలైన సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తుంది. 'నిన్ను నిన్నుగా' కథానిక ఈ సంపుటిలోని కథానికలకి భిన్నమైనది. హాస్యరస ప్రధానమైనది. బహుశ సీరియస్ విషయాల మధ్య రిలీఫ్ గా ఉంటుందని ఈ కథానికని ఉంచారనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో 'బహుమతి' కథానికల్ని సృష్టించిన ఆయన కలం, మరిన్ని మంచి కథానికల్ని సృష్టించాలని కోరుకుంటూ....
- డా వేదగిరి రాంబాబు
సంస్కరణని ఇంటి దగ్గర నుంచే ప్రారంభించి క్రమంగా సమాజంలోనూ జరిగేట్టు చూడాలి అని చెప్పే గొప్ప కథానిక 'స్త్రీకారం'. స్త్రీ కేవలం అమ్మేకాదు అవసరమైతే ఆదిశక్తి అవతారం కూడా ఎత్తుతుందనే విషయాన్ని 'స్త్రీకారం' ద్వారా చెప్పారు రచయిత. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే ఆ ప్రొఫెసర్ ని సమాజం అంతా కూడా క్షమించగలదేమో కానీ ఇంట్లో తన చాటున మనుగడ సాగిస్తున్న భార్య ఎంత మాత్రం క్షమించకపోవడమే కాదు కీచక సంతతని మార్చాలనే అసలైన సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తుంది. 'నిన్ను నిన్నుగా' కథానిక ఈ సంపుటిలోని కథానికలకి భిన్నమైనది. హాస్యరస ప్రధానమైనది. బహుశ సీరియస్ విషయాల మధ్య రిలీఫ్ గా ఉంటుందని ఈ కథానికని ఉంచారనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో 'బహుమతి' కథానికల్ని సృష్టించిన ఆయన కలం, మరిన్ని మంచి కథానికల్ని సృష్టించాలని కోరుకుంటూ.... - డా వేదగిరి రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.