స్త్రీపరమైన కథలు, నవలలు రాయడం రచయితకి కొత్తేంకాదు. మరీ ముఖ్యంగా వేలుగులతీరం, భూదేవి, నేనుసైతం, నేపధ్యం నవలలు భిన్న కోణాల్లో స్త్రీల జీవనాన్ని చర్చించాయి. ఇంత చెప్పినా చెప్పిన దానికంటే చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది మగువల మనుగడ గురించి
'భవాంభోజనేత్రాజ సంపూజ్యమానాం లసన్మందహాసం ప్రభావక్త్ర చిహ్నం...'
బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పూజిమ్పబడుచున్నది, ప్రకాశించు చిరునవ్వుతో కూడిన ముఖము కలది... అంటూ అమ్మవారిని వర్ణిస్తారు శంకరాచార్యులు.
ఈ ప్రస్తావన ఎందుకంటే! స్త్రీ అన్న ఒక్క అక్షరంలోనే నవ శక్తులు ఉన్నాయని, ఆ ఆదిపరాశక్తిని త్రిమూర్తులే సాక్షాత్తూ పూజిస్తారానీ శంకరభగవత్పాదులు చెప్పిన మాటల్లో ప్రతి స్త్రా అంతోటి శక్తివంతురాలన్న అర్థం దాగి ఉంది. ఆధునిక స్త్రీకూడా అంతటి శక్తివంతురాలే. కానీ "పూర్వకాలపు స్త్రీ ఎంత ఇరుకైనా ఒక నీతికి, తాననుకున్న ధర్మానికీ, భర్తా బంధువులా, సంఘం వీటికి బానిస. ఈనాటి స్త్రీ తనకి తానే బానిస" అంటారు చలం తన రచన 'స్త్రీ' లో.
ఈ రెండిటిని సమన్వయిస్తూ బానిసత్వం నుండి బాహ్యప్రపంచం పాదాభివందనం చేసేలా తనని తాను తీర్చిదిద్దుకునే స్త్రీ వ్యక్తిత్త్వానికి అద్దం పట్టిన నవల సింహప్రసాద్ 'స్త్రీపర్వం'.
స్త్రీపరమైన కథలు, నవలలు రాయడం రచయితకి కొత్తేంకాదు. మరీ ముఖ్యంగా వేలుగులతీరం, భూదేవి, నేనుసైతం, నేపధ్యం నవలలు భిన్న కోణాల్లో స్త్రీల జీవనాన్ని చర్చించాయి. ఇంత చెప్పినా చెప్పిన దానికంటే చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది మగువల మనుగడ గురించి 'భవాంభోజనేత్రాజ సంపూజ్యమానాం లసన్మందహాసం ప్రభావక్త్ర చిహ్నం...' బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పూజిమ్పబడుచున్నది, ప్రకాశించు చిరునవ్వుతో కూడిన ముఖము కలది... అంటూ అమ్మవారిని వర్ణిస్తారు శంకరాచార్యులు. ఈ ప్రస్తావన ఎందుకంటే! స్త్రీ అన్న ఒక్క అక్షరంలోనే నవ శక్తులు ఉన్నాయని, ఆ ఆదిపరాశక్తిని త్రిమూర్తులే సాక్షాత్తూ పూజిస్తారానీ శంకరభగవత్పాదులు చెప్పిన మాటల్లో ప్రతి స్త్రా అంతోటి శక్తివంతురాలన్న అర్థం దాగి ఉంది. ఆధునిక స్త్రీకూడా అంతటి శక్తివంతురాలే. కానీ "పూర్వకాలపు స్త్రీ ఎంత ఇరుకైనా ఒక నీతికి, తాననుకున్న ధర్మానికీ, భర్తా బంధువులా, సంఘం వీటికి బానిస. ఈనాటి స్త్రీ తనకి తానే బానిస" అంటారు చలం తన రచన 'స్త్రీ' లో. ఈ రెండిటిని సమన్వయిస్తూ బానిసత్వం నుండి బాహ్యప్రపంచం పాదాభివందనం చేసేలా తనని తాను తీర్చిదిద్దుకునే స్త్రీ వ్యక్తిత్త్వానికి అద్దం పట్టిన నవల సింహప్రసాద్ 'స్త్రీపర్వం'.© 2017,www.logili.com All Rights Reserved.