Title | Price | |
Adhirohanam | Rs.75 | In Stock |
అధిరోహణమ్
ముదిగొండ వీరభద్రయ్య
అధిమానస చేతననుండి జాలువారిన కవిత్వం నూటికి నూరుపాళ్లు శక్తిమంతంగాను, రమణీయంగాను ఉంటుంది. అలాంటి కవిత్వంలో శిల్పం కూడా సార్థకంగా, ఔచితీభరితంగా సహజంగా కుదురుకుంటుందనటానికి ఈ అధిరోహణమే ప్రత్యక్ష సాక్ష్యం. శైశవం నుండి బాల్యానికి, బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి తరుణవయస్సుకు, తరుణుడు విరాగిగా, చిత్రభానుడు మారేటప్పుడు ఈ కవి సమకూర్చిన శిల్పం మహాకావ్యాల ఒరవడిలోనిది. కావ్యాన్ని కావ్యనిర్మాణాన్ని, కావ్యానుభవాన్ని పరమార్థంతో అనుసంధించిన ఈ కవి శేముషి, ఋషులు పండించిన శివాత్మ.
- ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు
జీవితంలోని ఆయా దశల్లో పొందిన అనుభూతులను నెమరువేసుకుంటూ కవి తన శైశవ, యౌవన, వార్ధక్య చక్రభ్రమణాన్ని, జీవితగమనాన్ని కవిత్వీకరించారు ఈ కావ్యంలో..
-డా|| పి. వారిజా రాణి
కొండ దిగుతూ కూడా అధిరోహిస్తున్నాననుకోవటం మాయ. ముందుకు వేస్తున్నాననుకొంటూ, ప్రతి అడుగూ వెనుకకే వేస్తున్న మనిషి ఎప్పటికైనా శిఖరాగ్రానికి చేరుకోగలడా? అనే వేదనలో ఉన్న ఈ కవి, మనిషి చేరవలసిన చోటుకి మార్గనిర్దేశకత్వం చేస్తున్నాడు ఈ కావ్యంలో,
- డా॥ కాకుమాని శ్రీనివాసరావు
ఈ అధిరోహణానికి ఆత్మాశ్రయత్వం అంతర్వాహిని. అంకురంగా ప్రారంభమై జీవితమంతా పరుచుకున్న అనురాగఝరిని విరాగ సాగరంలో ఐక్యం చేయడం. చిత్రభానుడి లక్ష్యం. నిమ్నత్వం వైపు కాకుండా సాధన ద్వారా దిశను ఊర్ధ్వముఖంగా కొనసాగించే ప్రయాణం ఇది. అందుకే ఇది అధిరోహణం.
-డా. ఎస్.ఎల్.వి.ఉమామహేశ్వర రావు
అధిరోహణమ్ ముదిగొండ వీరభద్రయ్య అధిమానస చేతననుండి జాలువారిన కవిత్వం నూటికి నూరుపాళ్లు శక్తిమంతంగాను, రమణీయంగాను ఉంటుంది. అలాంటి కవిత్వంలో శిల్పం కూడా సార్థకంగా, ఔచితీభరితంగా సహజంగా కుదురుకుంటుందనటానికి ఈ అధిరోహణమే ప్రత్యక్ష సాక్ష్యం. శైశవం నుండి బాల్యానికి, బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి తరుణవయస్సుకు, తరుణుడు విరాగిగా, చిత్రభానుడు మారేటప్పుడు ఈ కవి సమకూర్చిన శిల్పం మహాకావ్యాల ఒరవడిలోనిది. కావ్యాన్ని కావ్యనిర్మాణాన్ని, కావ్యానుభవాన్ని పరమార్థంతో అనుసంధించిన ఈ కవి శేముషి, ఋషులు పండించిన శివాత్మ. - ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు జీవితంలోని ఆయా దశల్లో పొందిన అనుభూతులను నెమరువేసుకుంటూ కవి తన శైశవ, యౌవన, వార్ధక్య చక్రభ్రమణాన్ని, జీవితగమనాన్ని కవిత్వీకరించారు ఈ కావ్యంలో.. -డా|| పి. వారిజా రాణి కొండ దిగుతూ కూడా అధిరోహిస్తున్నాననుకోవటం మాయ. ముందుకు వేస్తున్నాననుకొంటూ, ప్రతి అడుగూ వెనుకకే వేస్తున్న మనిషి ఎప్పటికైనా శిఖరాగ్రానికి చేరుకోగలడా? అనే వేదనలో ఉన్న ఈ కవి, మనిషి చేరవలసిన చోటుకి మార్గనిర్దేశకత్వం చేస్తున్నాడు ఈ కావ్యంలో, - డా॥ కాకుమాని శ్రీనివాసరావు ఈ అధిరోహణానికి ఆత్మాశ్రయత్వం అంతర్వాహిని. అంకురంగా ప్రారంభమై జీవితమంతా పరుచుకున్న అనురాగఝరిని విరాగ సాగరంలో ఐక్యం చేయడం. చిత్రభానుడి లక్ష్యం. నిమ్నత్వం వైపు కాకుండా సాధన ద్వారా దిశను ఊర్ధ్వముఖంగా కొనసాగించే ప్రయాణం ఇది. అందుకే ఇది అధిరోహణం. -డా. ఎస్.ఎల్.వి.ఉమామహేశ్వర రావు© 2017,www.logili.com All Rights Reserved.