లేత నీలిరంగు చీర కట్టుకుని, ఎంచగ్గా నవ్వుల పువ్వుల్ని రువుతున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉందా సముద్రం. పైకిలేస్తూ, కిందకు దుముకుతూ, తుళ్ళుతూ, పెద్ద శబ్దంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న అలలు సముద్ర సుందరి సోయగాల్లా ఉన్నాయి. సాయంత్రం నీరెండ అలల మీద, సముద్రం ఒడ్డునున్న ఇసక మీద పడి బంగారపు పుప్పోడిలా మెరుస్తోంది. ఆ సముద్రానికి కుడివైపు రెండెకరాల విశాలమైన స్థలంలో కాలేజి. పగలంతా అమ్మాయిలతోనూ, అబ్బాయిలతోనూ హుషారుగా ఉండే ఆ కాలేజీ సాయంత్రం వాళ్ళంతా వెళ్ళిపోగానే ఒంటరిదయిపోతుంది.
ఆ కాలేజీ ప్లేగ్రౌండ్ లో మాత్రం సందడిగా ఉంటుంది. అక్కడ కొంతమంది అబ్బాయిలు హాకీ ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఇంకొకర్ని గేలి చేసుకుంటూ, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, సరదాగా కొట్టుకుంటూ తమాషాగా తిట్టుకుంటూ ఉండే ఆ వాతావరణం చూడముచ్చటగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
లేత నీలిరంగు చీర కట్టుకుని, ఎంచగ్గా నవ్వుల పువ్వుల్ని రువుతున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉందా సముద్రం. పైకిలేస్తూ, కిందకు దుముకుతూ, తుళ్ళుతూ, పెద్ద శబ్దంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న అలలు సముద్ర సుందరి సోయగాల్లా ఉన్నాయి. సాయంత్రం నీరెండ అలల మీద, సముద్రం ఒడ్డునున్న ఇసక మీద పడి బంగారపు పుప్పోడిలా మెరుస్తోంది. ఆ సముద్రానికి కుడివైపు రెండెకరాల విశాలమైన స్థలంలో కాలేజి. పగలంతా అమ్మాయిలతోనూ, అబ్బాయిలతోనూ హుషారుగా ఉండే ఆ కాలేజీ సాయంత్రం వాళ్ళంతా వెళ్ళిపోగానే ఒంటరిదయిపోతుంది. ఆ కాలేజీ ప్లేగ్రౌండ్ లో మాత్రం సందడిగా ఉంటుంది. అక్కడ కొంతమంది అబ్బాయిలు హాకీ ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఇంకొకర్ని గేలి చేసుకుంటూ, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, సరదాగా కొట్టుకుంటూ తమాషాగా తిట్టుకుంటూ ఉండే ఆ వాతావరణం చూడముచ్చటగా ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.