"హిట్లర్...
డిటెక్టివ్ భగవాన్
ముప్ఫై సంవత్సరాల క్రితం తన శక్తి సామర్థ్యాలతో, ప్రపంచాన్నంతా తన చేతిలో పెట్టుకోవాలని బీభత్సకరమైన ప్రయత్నాలు చేశాడు - జర్మనీ నియంత హిట్లర్..
"తన వద్దనున్న ఆధునిక ఆయుధాలతోను, యుద్ధ తంత్రాలతోను ప్రపంచ దేశాలన్నిటిని అల్లకల్లోలం చేసి ఏకఛత్రాధిపత్యం వహించాలని విశ్వప్రయత్నం చేశాడు. హిట్లర్.
"అతనికి ముందు - నెపోలియన్, అలెగ్జాండర్లు కూడా ప్రపంచాన్నంతా జయించి, అధికారం చలాయించాలనే వాంఛించారు.
"కాని, మహత్వాకాంక్షతో సాగించిన ఏ సమరం యింతవరకు విజయాన్ని పొందలేదు.
"ప్రత్యేకించి రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధాల వల్ల రక్తపాతం తప్ప మరో ప్రయోజనం లేదని, హిట్లర్ తో పాటు అగ్రదేశాల నాయకులందరూ గ్రహించారు.
“అందుకే, అప్పటి నుంచి ప్రపంచ రాజ్యాలన్నీ తమ పరస్పర విభేదాలను భద్రతాసమితి ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోడానికే ప్రయత్నిస్తున్నాయి.
“అయితే, ఆనాటి హిట్లర్ని ఇంతవరకు ఎవరూ మరచిపోలేదు.. మరచిపోలేరు..
"హిట్లర్ విపరీతమైన తెలివిపరుడు, అసాధ్యుడు, అఖండుడు, ధైర్య సాహసాలుగల మహావీరుడు.. ప్రపంచ రాజ్యాలన్నిటిని ఒకే పతాకం కిందకు తీసుకు వచ్చి, ప్రపంచాన్నంతా తనే పరిపాలించాలనుకున్నాడు. తన వద్దనున్న ఆధునిక ఆయుధాలతోను, యంత్రాలతోను, సైనిక్ బలంతోను బ్రహ్మాండమైన వ్యూహాలను సృష్టించాడు. ఎంతో రక్తపాతాన్ని, బీభత్సాన్ని కలిగించాడు. ప్రపంచాన్నంతా గడ - గడ ఒణికించాడు.”
"తన నిరంకుశత్వం, నియంతృత్వం, రాజకీయ ధోరణీ నచ్చనివారు తనను చంపడానికి ప్రయత్నించవచ్చునని ఊహించి తన శత్రువులను మోసపరచడానికి అచ్చం తనలాంటి వాళ్ళను ఎంతోమందిని తయారు చేశాడు...............
"హిట్లర్... డిటెక్టివ్ భగవాన్ ముప్ఫై సంవత్సరాల క్రితం తన శక్తి సామర్థ్యాలతో, ప్రపంచాన్నంతా తన చేతిలో పెట్టుకోవాలని బీభత్సకరమైన ప్రయత్నాలు చేశాడు - జర్మనీ నియంత హిట్లర్.. "తన వద్దనున్న ఆధునిక ఆయుధాలతోను, యుద్ధ తంత్రాలతోను ప్రపంచ దేశాలన్నిటిని అల్లకల్లోలం చేసి ఏకఛత్రాధిపత్యం వహించాలని విశ్వప్రయత్నం చేశాడు. హిట్లర్. "అతనికి ముందు - నెపోలియన్, అలెగ్జాండర్లు కూడా ప్రపంచాన్నంతా జయించి, అధికారం చలాయించాలనే వాంఛించారు. "కాని, మహత్వాకాంక్షతో సాగించిన ఏ సమరం యింతవరకు విజయాన్ని పొందలేదు. "ప్రత్యేకించి రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధాల వల్ల రక్తపాతం తప్ప మరో ప్రయోజనం లేదని, హిట్లర్ తో పాటు అగ్రదేశాల నాయకులందరూ గ్రహించారు. “అందుకే, అప్పటి నుంచి ప్రపంచ రాజ్యాలన్నీ తమ పరస్పర విభేదాలను భద్రతాసమితి ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోడానికే ప్రయత్నిస్తున్నాయి. “అయితే, ఆనాటి హిట్లర్ని ఇంతవరకు ఎవరూ మరచిపోలేదు.. మరచిపోలేరు.. "హిట్లర్ విపరీతమైన తెలివిపరుడు, అసాధ్యుడు, అఖండుడు, ధైర్య సాహసాలుగల మహావీరుడు.. ప్రపంచ రాజ్యాలన్నిటిని ఒకే పతాకం కిందకు తీసుకు వచ్చి, ప్రపంచాన్నంతా తనే పరిపాలించాలనుకున్నాడు. తన వద్దనున్న ఆధునిక ఆయుధాలతోను, యంత్రాలతోను, సైనిక్ బలంతోను బ్రహ్మాండమైన వ్యూహాలను సృష్టించాడు. ఎంతో రక్తపాతాన్ని, బీభత్సాన్ని కలిగించాడు. ప్రపంచాన్నంతా గడ - గడ ఒణికించాడు.” "తన నిరంకుశత్వం, నియంతృత్వం, రాజకీయ ధోరణీ నచ్చనివారు తనను చంపడానికి ప్రయత్నించవచ్చునని ఊహించి తన శత్రువులను మోసపరచడానికి అచ్చం తనలాంటి వాళ్ళను ఎంతోమందిని తయారు చేశాడు...............© 2017,www.logili.com All Rights Reserved.