ఆదిమ కాలం నుండి మనిషి ప్రకృతిలో స్నేహం చేస్తూ, ప్రకృతితో పోరాటం చేస్తూ తన మనుగడ సాగిస్తున్నాడు. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించు కుంటూ, ప్రకృతికి తను ఉపయోగపడుతూ వస్తున్నాడు. ప్రకృతికి భయపడుతూ, ప్రకృతిని ప్రేమిస్తూ బతుకుతున్నాడు. నిజానికి మనిషి ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలోని జీవరాశిని విభజించినప్పుడు మనుషులు, పశువులు, పక్షులు, పురుగులు, చెట్టూ, పుట్ట, గుట్ట అనేవి ఏర్పడతాయి. ప్రకృతిలో ఒక భాగమైన మానవుడు మరో భాగమైన జంతువును మచ్చిక చేసుకున్న కథే 'జిగిరి' నవల. - పెద్దింటి అశోక్ కుమార్