ఊరికి దూరంగా ఓ గుడిసెలో ఉంటూ ఏడాది పొడుగునా ఎండలో వానలో ఊరూరు తిరుగుతూ గంగిరెద్దును ఆడించుకుని బతికే ఓ సంచార జాతి వ్యక్తి రాజలింగం. ఉన్నట్టుండి అతనికి ఒకనాడు ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ తిరుగుడు మాని ఊరిలో ఓ చిన్న ఇల్లు కట్టుకుని నాగరిక సమాజంలో భద్రంగా బతికితే ఎలా ఉంటుంది అని.
మనకు చిన్నదే కాని అది అతనికి పెద్ద కోరిక. ఊరిలో బతకడమంటే అడివిలో బతికినంత తేలిక కాదు గదా. ముఖ్యంగా కులం బలమైనా ఉండాలె. పైసల బలమైనా ఉండాలె. ఈ రెండూ లేని రాజ లింగం ఊరిలో ఓ ఇల్లయితే కట్టుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది... ఈ నాగరిక సమాజం అతడిని ఎలా చూసింది... చివరికి అతని కోరిక నెరవేరిందా... ఊరు అతడిని నిండు మనసుతో ఆహ్వానించిందా... నాగరిక సమాజపు దాడిని అతను ఎలా తిప్పికొట్టాడు... అతను ఓడిపోయాడా గెలిచాడా...
గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి.
ఊరికి దూరంగా ఓ గుడిసెలో ఉంటూ ఏడాది పొడుగునా ఎండలో వానలో ఊరూరు తిరుగుతూ గంగిరెద్దును ఆడించుకుని బతికే ఓ సంచార జాతి వ్యక్తి రాజలింగం. ఉన్నట్టుండి అతనికి ఒకనాడు ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ తిరుగుడు మాని ఊరిలో ఓ చిన్న ఇల్లు కట్టుకుని నాగరిక సమాజంలో భద్రంగా బతికితే ఎలా ఉంటుంది అని. మనకు చిన్నదే కాని అది అతనికి పెద్ద కోరిక. ఊరిలో బతకడమంటే అడివిలో బతికినంత తేలిక కాదు గదా. ముఖ్యంగా కులం బలమైనా ఉండాలె. పైసల బలమైనా ఉండాలె. ఈ రెండూ లేని రాజ లింగం ఊరిలో ఓ ఇల్లయితే కట్టుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది... ఈ నాగరిక సమాజం అతడిని ఎలా చూసింది... చివరికి అతని కోరిక నెరవేరిందా... ఊరు అతడిని నిండు మనసుతో ఆహ్వానించిందా... నాగరిక సమాజపు దాడిని అతను ఎలా తిప్పికొట్టాడు... అతను ఓడిపోయాడా గెలిచాడా... గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి.© 2017,www.logili.com All Rights Reserved.