Title | Price | |
Manishini Kalasinattundali | Rs.625 | In Stock |
ఓ రెండు నిమిషాలు
సప్తతి సందర్భం అన్నప్పుడు మళ్లీ షష్టిపూర్తి నాటి డోలాయమానస్థితి ఎదురైంది. 'అయితే ఈసారి కరోనాకాలం దానికి కూడా అడ్డుకట్టవేసింది. నా పుట్టిన తేది 25-6-1948గా రికార్డయి వుంది. కాని ఓ నోటుబుక్కులో మా నాయన తిథి ప్రకారం రాసిపెట్టిన తారీఖు మాత్రం 25-6-1950. దీని ప్రకారమే 2010లో నా షష్టిపూర్తి ఉత్సవం జరిగింది.
అప్పుడు నా శ్రీమతి అరుణ సంపాదకత్వంలో 'గోపి కవిత్వం' పేరిట 3 సంపుటాలు వెలువడ్డాయి. వాటిలో అప్పటి వరకు అచ్చయిన 15 సంపుటాలు ఉన్నాయి. 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు నన్ను writer in Residence అనే స్కీమ్ కింద select చేసి గౌరవించారు. ఆ పురస్కార ధనంతో వాటి ముద్రణ జరిగింది. ఇప్పటి పరిస్థితి వేరు. కవితా సంపుటాల సంఖ్య 26కి పెరిగింది. 56 సంవత్సరాలుగా
నేను సుమారు 1500 కవితలు రాసి వుంటే దాదాపు 500 కవితలు గత ఆరేండ్లలోనే ' (2018-19) రాశాను. అంటే ఈ కాలంలో కవిత్వోద్వేగం లేకుండా జీవించిన క్షణాలు తక్కువ.
కచ్చితంగా ప్రతి సంవత్సరం కాదు గాని, ఒకటి రెండు మినహాయింపులతో రెగ్యులర్గా కవితల పుస్తకం తేవడం నా అలవాటుగా మారింది. లభ్యమౌతున్న రాశిలోంచి కొన్ని కొన్ని వేసుకుంటూపోతే ఇంకెన్నో కవితలు మిగిలిపోతాయి. అందుకని సప్తతి సందర్భంగా 2016, 17, 18, 19 సంవత్సరాల్లో రాసిన కొత్త కవితలతో ఒక బృహద్ధంథం 'వెయ్యాలని ఆత్మీయమిత్రులు సంకల్పించారు. 2020 నాటికి 70 యేండ్లు వస్తాయి............
ఓ రెండు నిమిషాలు సప్తతి సందర్భం అన్నప్పుడు మళ్లీ షష్టిపూర్తి నాటి డోలాయమానస్థితి ఎదురైంది. 'అయితే ఈసారి కరోనాకాలం దానికి కూడా అడ్డుకట్టవేసింది. నా పుట్టిన తేది 25-6-1948గా రికార్డయి వుంది. కాని ఓ నోటుబుక్కులో మా నాయన తిథి ప్రకారం రాసిపెట్టిన తారీఖు మాత్రం 25-6-1950. దీని ప్రకారమే 2010లో నా షష్టిపూర్తి ఉత్సవం జరిగింది. అప్పుడు నా శ్రీమతి అరుణ సంపాదకత్వంలో 'గోపి కవిత్వం' పేరిట 3 సంపుటాలు వెలువడ్డాయి. వాటిలో అప్పటి వరకు అచ్చయిన 15 సంపుటాలు ఉన్నాయి. 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు నన్ను writer in Residence అనే స్కీమ్ కింద select చేసి గౌరవించారు. ఆ పురస్కార ధనంతో వాటి ముద్రణ జరిగింది. ఇప్పటి పరిస్థితి వేరు. కవితా సంపుటాల సంఖ్య 26కి పెరిగింది. 56 సంవత్సరాలుగా నేను సుమారు 1500 కవితలు రాసి వుంటే దాదాపు 500 కవితలు గత ఆరేండ్లలోనే ' (2018-19) రాశాను. అంటే ఈ కాలంలో కవిత్వోద్వేగం లేకుండా జీవించిన క్షణాలు తక్కువ. కచ్చితంగా ప్రతి సంవత్సరం కాదు గాని, ఒకటి రెండు మినహాయింపులతో రెగ్యులర్గా కవితల పుస్తకం తేవడం నా అలవాటుగా మారింది. లభ్యమౌతున్న రాశిలోంచి కొన్ని కొన్ని వేసుకుంటూపోతే ఇంకెన్నో కవితలు మిగిలిపోతాయి. అందుకని సప్తతి సందర్భంగా 2016, 17, 18, 19 సంవత్సరాల్లో రాసిన కొత్త కవితలతో ఒక బృహద్ధంథం 'వెయ్యాలని ఆత్మీయమిత్రులు సంకల్పించారు. 2020 నాటికి 70 యేండ్లు వస్తాయి............© 2017,www.logili.com All Rights Reserved.