వీరధర్మ యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. తన వంశంలో జన్మించే పురుషులు ఏడు తరాలపాటు నలభై ఏళ్లకే మరణించేలా ఎవరో శాపం పెట్టారని తెలుసుకుంటాడు. గతించిన మూడు తరాలలో ఆశాపం నిజమైంది. తనకింక పదహారేళ్ళ ఆయుర్దాయం మాత్రమే ఉంది! పరమపదించిన తల్లి తనను కలకాలం జీవించమంటూ చాలాసార్లు దీవించింది. తన విషయంలో అమ్మ దీవెన ఫలిస్తుందా, అజ్ఞాతవ్యక్తి శాపం ఫలిస్తుందా? కన్నతల్లి దీవెనను నిజం చేస్తూ చావును జయించి, మృత్యుంజయుడు కావాలన్న పట్టుదలతో గమ్యంలేని ప్రయాణం ప్రారంభిస్తాడు వీరధర్మ.
ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? మృత్యువును జయించడం ఎట్లా? ఇంతకూ మనిషి మరణాన్ని జయించగలడా? ప్రశ్నల పరంపర అతని ఆశను ఆశయంగా మారుస్తుంది. ఆ మహదాశయం అతన్ని ఏ దారిలో నడిపించింది? అతను ఎన్ని అవరోధాల్ని అధిగమించాడు? నిజంగా మృత్యువును జయించాడా? ఉత్కంఠను రేకెత్తించే ప్రశ్నలకు సమాధానాల కోసం చదవండి: "మృత్యుంజయుడు
ఇది వక్కంతం సూర్యనారాయణ రావ్ రచన.
చదివించే చక్కని రచన
- వక్కంతం సూర్యనారాయణ రావ్