పెళ్ళికూతురిని తీసుకువచ్చి పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టారు. "ఏమిటో ఈ అగ్ని ఈ హోమం... ఈ మంటలు... ఈ మంత్రాలూ! అగ్నిహోమంలో నుండి వచ్చే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టు, ఆ వేడికి శరీరమంతా మండిపడుతున్నట్టు ఉంది.
మనసు అలజడిగా ఉంది..."
ఆ అగ్ని వాసన ఆమె నరనరాల్లో ఉద్రేకాన్ని నింపుతుంది. నేతిధారకు మండే చిన్ని మంటలైనా... పెద్ద అగ్ని చీలికల్లా మీదకు వస్తున్నట్లున్నాయి. శరీరం భగ్గున మండిపోతున్నట్టు అనిపించసాగింది. పురోహితుడు ఆమె చేతిలో పెట్టినవాటిని అగ్నిలో వేయకుండా చేతి గుప్పిట్లో బిగించి పట్టుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ముఖం గంభీరంగా మారింది. అంతవరకూ విరిసిన విరజాజి మొగ్గలా వున్న ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది.
కళ్ళు అగ్నిగోళాల్లా అయిపోయాయి.
"నో... నో... నేను ఈ అగ్నిలో వెయ్యను" అంది పెద్దగా. కోటి ఆశలతో పెళ్లిపీటలమీద కూర్చున్న ఆ పెళ్ళికూతురికి హోమాన్ని చూస్తూనే ఎందుకలాంటి పరిస్థితి ఎదురయింది? చదవండి ఎన్.పూజిత గారి 'ప్రేమకు పట్టాభిషేకం'.
- ఎన్.పూజిత
పెళ్ళికూతురిని తీసుకువచ్చి పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టారు. "ఏమిటో ఈ అగ్ని ఈ హోమం... ఈ మంటలు... ఈ మంత్రాలూ! అగ్నిహోమంలో నుండి వచ్చే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టు, ఆ వేడికి శరీరమంతా మండిపడుతున్నట్టు ఉంది. మనసు అలజడిగా ఉంది..." ఆ అగ్ని వాసన ఆమె నరనరాల్లో ఉద్రేకాన్ని నింపుతుంది. నేతిధారకు మండే చిన్ని మంటలైనా... పెద్ద అగ్ని చీలికల్లా మీదకు వస్తున్నట్లున్నాయి. శరీరం భగ్గున మండిపోతున్నట్టు అనిపించసాగింది. పురోహితుడు ఆమె చేతిలో పెట్టినవాటిని అగ్నిలో వేయకుండా చేతి గుప్పిట్లో బిగించి పట్టుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ముఖం గంభీరంగా మారింది. అంతవరకూ విరిసిన విరజాజి మొగ్గలా వున్న ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళు అగ్నిగోళాల్లా అయిపోయాయి. "నో... నో... నేను ఈ అగ్నిలో వెయ్యను" అంది పెద్దగా. కోటి ఆశలతో పెళ్లిపీటలమీద కూర్చున్న ఆ పెళ్ళికూతురికి హోమాన్ని చూస్తూనే ఎందుకలాంటి పరిస్థితి ఎదురయింది? చదవండి ఎన్.పూజిత గారి 'ప్రేమకు పట్టాభిషేకం'. - ఎన్.పూజిత© 2017,www.logili.com All Rights Reserved.