అమ్మ కళ్ళు
చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి నీ కళ్ళు
స్థాణువైపోతాను ఇక నేను -
రావి చెట్లు గలగలా వీచినట్టు, చల్లని గాలి ఏదో నా లోపల -
ఇన్నాళ్ళూ నేను చూడటం
మరచిన
వెన్నెల ఏదో, నేను వినలేని వాన ఏదో
నక్షత్రాలు మెరిసే ఆకాశం ఏదో, పూలు వీచే పరిమళం ఏదో
పసి పసిడి పవిత్రత ఏదో
ఇంత వయస్సులోనూ
ఇంత కటువైన నీ చివరి కాలంలోనూ, నీ కనుల సమక్షంలో
అత్యంత లాలిత్యంగా, అత్యంత నిర్మలంగా
ఇప్పటికీ ఆ కన్నుల్లో ఎక్కడా
నైరాశ్యపు జాడ లేదు, ఓటమి ఛాయ లేదు. జీవించడం పట్ల
ద్వేషం లేదు, ఇతరుల పట్ల నిందారోపణ
అసలే లేదు -......................
అమ్మ కళ్ళు చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి నీ కళ్ళు స్థాణువైపోతాను ఇక నేను - రావి చెట్లు గలగలా వీచినట్టు, చల్లని గాలి ఏదో నా లోపల - ఇన్నాళ్ళూ నేను చూడటం మరచిన వెన్నెల ఏదో, నేను వినలేని వాన ఏదో నక్షత్రాలు మెరిసే ఆకాశం ఏదో, పూలు వీచే పరిమళం ఏదో పసి పసిడి పవిత్రత ఏదో ఇంత వయస్సులోనూ ఇంత కటువైన నీ చివరి కాలంలోనూ, నీ కనుల సమక్షంలో అత్యంత లాలిత్యంగా, అత్యంత నిర్మలంగా ఇప్పటికీ ఆ కన్నుల్లో ఎక్కడా నైరాశ్యపు జాడ లేదు, ఓటమి ఛాయ లేదు. జీవించడం పట్ల ద్వేషం లేదు, ఇతరుల పట్ల నిందారోపణ అసలే లేదు -......................© 2017,www.logili.com All Rights Reserved.