'వెదురు పువ్వు లోని' కథల్లో బహుళ ప్రపంచం కన్పిస్తుంది. ఒక రకంగా అది కదంబ లోకం. కథల నేపథ్యం ఒక్కటి కాదు. ప్రకృతి, పరిసరాలు ఒక చోటివి కాదు. పాత్రలు, పాత్రల మనస్తత్వాలు భిన్నమైనవి. ఆ మనస్తత్వాలను ప్రభావితం చేసే కుటుంబ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతికాంశాలు ఒకే తరహాలోనివి కావు. పాత్రల స్వభావాలూ, ప్రవర్తనల మధ్య తారతమ్యాలూ, వైరుధ్యాలూ బాహ్య అంతరంగ ఘర్షణలూ - సామరస్యాలూ ఏకముఖీనం కాదు. కులాలు, మతాలూ, గ్రామాలు, పట్టణాలు, చదువులు, ఆర్ధిక అంతస్తులు, సమస్యలు అన్నీ మూసపోసినవి కావు. నరేంద్ర కథా వస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కన్పిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగిచూస్తే అవి సంక్లిష్టమైనవి. చాలా సంబద్ధమైనవి. కొన్ని అసంబద్ధమైనవి. సమకాలీన భారతదేశ భాషా సామాజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.
'వెదురు పువ్వు లోని' కథల్లో బహుళ ప్రపంచం కన్పిస్తుంది. ఒక రకంగా అది కదంబ లోకం. కథల నేపథ్యం ఒక్కటి కాదు. ప్రకృతి, పరిసరాలు ఒక చోటివి కాదు. పాత్రలు, పాత్రల మనస్తత్వాలు భిన్నమైనవి. ఆ మనస్తత్వాలను ప్రభావితం చేసే కుటుంబ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతికాంశాలు ఒకే తరహాలోనివి కావు. పాత్రల స్వభావాలూ, ప్రవర్తనల మధ్య తారతమ్యాలూ, వైరుధ్యాలూ బాహ్య అంతరంగ ఘర్షణలూ - సామరస్యాలూ ఏకముఖీనం కాదు. కులాలు, మతాలూ, గ్రామాలు, పట్టణాలు, చదువులు, ఆర్ధిక అంతస్తులు, సమస్యలు అన్నీ మూసపోసినవి కావు. నరేంద్ర కథా వస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కన్పిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగిచూస్తే అవి సంక్లిష్టమైనవి. చాలా సంబద్ధమైనవి. కొన్ని అసంబద్ధమైనవి. సమకాలీన భారతదేశ భాషా సామాజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.© 2017,www.logili.com All Rights Reserved.