కోటాకు
ఈ పెద్దకథ యిటీవలే 'రచన' రజతోత్సవ సంచికలో (2019 ఉగాది) వచ్చింది. గడచిన పాతికేళ్లుగా చందాకట్టని 'రచన' అభిమానపాఠకుణ్ణి. నేను, 'రచన' శాయి బాపట్లవాళ్లం. మాయాబజార్ లో మా రెండిళ్లకీ గోడే అడ్డం. నాకంటే సీనియర్. నాలుగో ఎకరం రాసీ రాసీ శాయిగారిని తెగ యిబ్బంది పెట్టాను. కనీసం 15, 18 సార్లు తిరగరాయడం, తప్పులు దిద్దడం అన్నింటినీ సహించారు. భరించారు. నా మిథునం కథని బాపు చేతిరాతలో, “దస్తూరీ తిలకం" అంటూ ఎంతో ఇష్టంగా, గౌరవంగా రచనలో అచ్చువేశారు, ఒకసారి కాదు, రెండుసార్లు రచన రజతోత్సవ సంచిక కొందరికే చేరుతుంది. మరికొందరికి, ఇంకొందరికి చేరడం కోసం నాలుగో ఎకరం కథని యిలా చిన్నసంపుటిగా వేద్దామనిపించింది. మాన్యమిత్రులు, సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ గిరిధర్ గౌడ్ నా కోరికని మన్నించి బొమ్మలు అందించడం యీ కథకు దక్కిన సౌభాగ్యం.
గ్రామీణ వాతావరణంలో సాగిన కథ అవడంవల్ల చేలగట్ల మీద, రైతుల నోళ్లలో నానే మాటల్ని పొదగడం సముచితం అన్పించింది. ఎక్కడికక్కడ పాతమాటలకి వివరణలు యిచ్చాను. ఈ కథాపుస్తకం హస్తభూషణంగా రూపొందడానికి కళ్లలో వత్తులు వేసుకుని అక్షరాలను సవరించిన అలనాటి కూరిమి చెలికాడు శ్రీ యన్నార్ తపస్వికి, నా యువసాహితీ నేస్తం చి॥ మోదుగుల రవికృష్ణకి (మా బాపట్లవాడే, ప్రస్తుతం కో-ఆర్డినేటర్, బుక్ పబ్లిషింగ్ & కల్చరల్ డిపార్ట్మెంట్, VIVA-VVIT, నంబూరు) నాలుగోఎకరంలో వాటా యిస్తున్నా. ఈ పుస్తక ఆలంకారికులు, ఆప్తులు చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు. 'మీకెందుకండీ...? అనవసరంగా తలతడుపుకోవడం' అని బతిమాలినా వినకుండా యీ పుస్తక ప్రచురణకి............
కోటాకు ఈ పెద్దకథ యిటీవలే 'రచన' రజతోత్సవ సంచికలో (2019 ఉగాది) వచ్చింది. గడచిన పాతికేళ్లుగా చందాకట్టని 'రచన' అభిమానపాఠకుణ్ణి. నేను, 'రచన' శాయి బాపట్లవాళ్లం. మాయాబజార్ లో మా రెండిళ్లకీ గోడే అడ్డం. నాకంటే సీనియర్. నాలుగో ఎకరం రాసీ రాసీ శాయిగారిని తెగ యిబ్బంది పెట్టాను. కనీసం 15, 18 సార్లు తిరగరాయడం, తప్పులు దిద్దడం అన్నింటినీ సహించారు. భరించారు. నా మిథునం కథని బాపు చేతిరాతలో, “దస్తూరీ తిలకం" అంటూ ఎంతో ఇష్టంగా, గౌరవంగా రచనలో అచ్చువేశారు, ఒకసారి కాదు, రెండుసార్లు రచన రజతోత్సవ సంచిక కొందరికే చేరుతుంది. మరికొందరికి, ఇంకొందరికి చేరడం కోసం నాలుగో ఎకరం కథని యిలా చిన్నసంపుటిగా వేద్దామనిపించింది. మాన్యమిత్రులు, సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ గిరిధర్ గౌడ్ నా కోరికని మన్నించి బొమ్మలు అందించడం యీ కథకు దక్కిన సౌభాగ్యం. గ్రామీణ వాతావరణంలో సాగిన కథ అవడంవల్ల చేలగట్ల మీద, రైతుల నోళ్లలో నానే మాటల్ని పొదగడం సముచితం అన్పించింది. ఎక్కడికక్కడ పాతమాటలకి వివరణలు యిచ్చాను. ఈ కథాపుస్తకం హస్తభూషణంగా రూపొందడానికి కళ్లలో వత్తులు వేసుకుని అక్షరాలను సవరించిన అలనాటి కూరిమి చెలికాడు శ్రీ యన్నార్ తపస్వికి, నా యువసాహితీ నేస్తం చి॥ మోదుగుల రవికృష్ణకి (మా బాపట్లవాడే, ప్రస్తుతం కో-ఆర్డినేటర్, బుక్ పబ్లిషింగ్ & కల్చరల్ డిపార్ట్మెంట్, VIVA-VVIT, నంబూరు) నాలుగోఎకరంలో వాటా యిస్తున్నా. ఈ పుస్తక ఆలంకారికులు, ఆప్తులు చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు. 'మీకెందుకండీ...? అనవసరంగా తలతడుపుకోవడం' అని బతిమాలినా వినకుండా యీ పుస్తక ప్రచురణకి............© 2017,www.logili.com All Rights Reserved.