" కన్నీటి దారాలతో గుండెలను కలిపి కుట్టాలి" అంటాడు కవి సాహిర్ లూధియాన్వీ. భారతదేశంలో వ్యవసాయరంగం తర్వాత అతి ఎక్కువగా ప్రజలు ఆధారపడిన రంగం చేనేత రంగం . ప్రపంచంలోని అతి ప్రాచీనమైన వృత్తులలో చేనేత ఒకటి. "ప్రపంచానికి నాగరికత నేర్పింది, బట్టలు కట్టడం అలవాటు చేసింది మనమే! ఈ నాగరికత ఒక్కనాడే హఠాత్తుగా అబ్బింది కాదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా "ఛుమంతర్" అనగానే ప్రత్యక్షమయ్యేది కాదు. మానవ జీవన వికాస, విస్తార, పరిమాణ, ప్రయోగదశల్లో జరిగే మార్పు. వికాసమే నాగరికత. "అది సమాజ పరిణామంతో పాటు అలవడిన విద్య" అంటాడు సంగిశెట్టి శ్రీనివాస్. అవును మరి, పత్తిని పుట్టించింది మనమే. కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆ పత్తిని వడికి దారం చేసింది మనమే.