ప్రాచీన కాలం నుంచీ మన దేశంలో సతీసహగమనాలు, బాల్యవివాహాలు వున్నాయి. అలాగే దేవతల పేరుతో సాగే దేవదాసీ, బసివినుల ఆచారం, ఇంకా ఓలి, కన్యాశుల్కం వంటి దురాచారాలు వుండనే వున్నాయి. ఇవన్నీ పురుషాధిక్యతా ఫలితంగా వచ్చినవి కాబట్టి వీటికి బలైపోతున్న వారు మాత్రం స్త్రీలే. సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటివి అన్నికులాల్లోనూ వున్నప్పటికీ బసివిని, దేవదాసీ ఆచారాలు మాత్రం శూద్ర, నిమ్నకులాల్లోనే వుండేవి. రాజారామ్ మోహన్ రాయ్, మహాత్మాఫూలే లాంటి సంఘసంస్కర్తల కృషితో 1829లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వీటిని నిషేధించింది. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వమూ ఆ చట్టాలను బలోపేతం చేయడంతో సతీసహగమనం, దేవదాసీ వ్యవస్థలు పూర్తిగా తొలగిపోయాయి. కానీ కొన్ని శూద్ర, అతిశూద్రకులాలలో బసివిని ఆచారం మాత్రం పాతికేళ్ల ముందువరకు బలంగా కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రపంచీకరణ ప్రభావంతోను, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతోను ప్రపంచమే సెల్లు రూపంలో అరచేతిలోకి వదిగిపోయిన ఈ కాలంలోనూ కొన్ని మారు మూల ప్రాంతాలలో ఇంకా ఆ ఆచారం కనిపిస్తూనే వుంది. ఇలా అది కొనసాగడానికి శూద్ర, నిమ్న కులాలలో వున్న అవిద్య, అజ్ఞానం, పేదరికమే కారణం. దీన్ని ఆసరాగా చేసుకుని అగ్రకుల భూస్వాములు కొందరు తమ స్వార్థం కోసం ఇంకా ఆ దురాచారాన్ని బతికించాలని చూస్తూనే వున్నారు...
అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పి, అణగారినకులాల చైతన్యం కోసం పోరాడిన ఒక అభాగ్యురాలి నేపథ్యంతో సాగే విప్లవాత్మక నాటకమే 'పసుపుచీర'.
సీమ శూద్ర జీవితాల యథ, వ్యధార్థ గాథలను చిత్రిస్తున్న ప్రసిద్ధ రచయిత డా॥ వి.ఆర్.రాసాని కలంనుంచి వచ్చిన మరొకవిశిష్టనాటకావిష్కరణే ఈ 'పసుపుచీర'.
సీల అభ్యున్నతిని కోరుకునే ప్రతి తెలుగు వాడు చదివిదాచుకోవాల్సిన నాటకం ఇది.
ప్రాచీన కాలం నుంచీ మన దేశంలో సతీసహగమనాలు, బాల్యవివాహాలు వున్నాయి. అలాగే దేవతల పేరుతో సాగే దేవదాసీ, బసివినుల ఆచారం, ఇంకా ఓలి, కన్యాశుల్కం వంటి దురాచారాలు వుండనే వున్నాయి. ఇవన్నీ పురుషాధిక్యతా ఫలితంగా వచ్చినవి కాబట్టి వీటికి బలైపోతున్న వారు మాత్రం స్త్రీలే. సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటివి అన్నికులాల్లోనూ వున్నప్పటికీ బసివిని, దేవదాసీ ఆచారాలు మాత్రం శూద్ర, నిమ్నకులాల్లోనే వుండేవి. రాజారామ్ మోహన్ రాయ్, మహాత్మాఫూలే లాంటి సంఘసంస్కర్తల కృషితో 1829లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వీటిని నిషేధించింది. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వమూ ఆ చట్టాలను బలోపేతం చేయడంతో సతీసహగమనం, దేవదాసీ వ్యవస్థలు పూర్తిగా తొలగిపోయాయి. కానీ కొన్ని శూద్ర, అతిశూద్రకులాలలో బసివిని ఆచారం మాత్రం పాతికేళ్ల ముందువరకు బలంగా కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతోను, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతోను ప్రపంచమే సెల్లు రూపంలో అరచేతిలోకి వదిగిపోయిన ఈ కాలంలోనూ కొన్ని మారు మూల ప్రాంతాలలో ఇంకా ఆ ఆచారం కనిపిస్తూనే వుంది. ఇలా అది కొనసాగడానికి శూద్ర, నిమ్న కులాలలో వున్న అవిద్య, అజ్ఞానం, పేదరికమే కారణం. దీన్ని ఆసరాగా చేసుకుని అగ్రకుల భూస్వాములు కొందరు తమ స్వార్థం కోసం ఇంకా ఆ దురాచారాన్ని బతికించాలని చూస్తూనే వున్నారు... అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పి, అణగారినకులాల చైతన్యం కోసం పోరాడిన ఒక అభాగ్యురాలి నేపథ్యంతో సాగే విప్లవాత్మక నాటకమే 'పసుపుచీర'. సీమ శూద్ర జీవితాల యథ, వ్యధార్థ గాథలను చిత్రిస్తున్న ప్రసిద్ధ రచయిత డా॥ వి.ఆర్.రాసాని కలంనుంచి వచ్చిన మరొకవిశిష్టనాటకావిష్కరణే ఈ 'పసుపుచీర'. సీల అభ్యున్నతిని కోరుకునే ప్రతి తెలుగు వాడు చదివిదాచుకోవాల్సిన నాటకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.