కాలాన్ని వెనక్కి తిప్పలెం. అందరికి తెలిసిందే. కానీ ఏ సిద్ధుడు లేపనం ప్రసాదించకపోయినా, మనసు సాయంతో కాలంలో వెనక్కి వెళ్లగలం. మనకి ఇష్టం వచ్చినంత సేపు , నచ్చినన్ని మజిలీలు వేయగలం. మన జీవన గమనంలో తారసిల్లిన ఎందరినో ఎన్నింటినో గుర్తు చేసుకోగలం. ఆ క్షణాలు అచ్చంగా మనవి.
వాటికే ప్లాష్ బ్యాక్ అని, నోస్టాల్జియా అని ఏవో పేర్లు పెట్టుకుంటాం. కాస్త వయసు మళ్ళాక - ఆ రోజుల్లో.... అంటూ మొదలు పెట్టినా, ఒకసారి ఏమైందంటే అని కళ్ళ ముందు చక్రాలు తిప్పుకున్న బాబోయ్ సోది అని చుట్టుపక్కల వాళ్ళు పారిపోతుండటం సమాజంలో రివాజు. కానీ అదే మాట మన పొత్తూరి విజయలక్ష్మి గారు అన్నారనుకోండి. మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకుంటాం. ఆవిడ ఎలాంటి నస పెట్టకుండా పనస పొట్టు కురంత కమ్మహా చెబుతారు ఆ కబుర్లు మరి. అందుకే స్పీడ్ బ్రేకర్స్ లేని రింగ్ రోడ్ లాంటి ఆ జ్ఞాపకాల వారధి మీద జాయిగా, జాయ్ ఫుల్ గా వెళ్ళిపోయి ఎంజాయి చేసి రావచ్చు. బుద్ధి పుడితే ఇంకాస్సేపు అక్కడే తచ్చాడవచ్చు.