అంతరంగం కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన
కుప్పె నాగరాజగారు ఈ పొత్తపు రచయిత. ఇందు లోనిదంతా వారి సొంత బతుకే. దొంబిదాసరుల బతు కులలోని పొంగులను కుంగులను, ఆటలను పాటలను, పుటకను చావును, పుటకచావుల నడుమ నడకను గుదిగుచ్చి మనముందు ఉంచినారు నాగరాజగారు. అరవై ఆరు కతల తలపుల మాలిక ఈ నోయి. ఈ కతలలో గొప్ప ఎత్తుగడలూ గొప్ప ముగింపులూ గొప్ప గొప్ప తీరులు తెన్నులు నడకలు నయగారాలు ఇవేవీ ఉండవు. అప్పుడే అమ్మకడుపు నుండి బయటపడ్డ పసికందు లాంటి కతలివి. కేరుమనే బిడ్డ తొలి పిలుపుకు కదిలే తల్లిలా మనకు తెలియకుండానే కతలవైపుకు పరుగెడతాము. మంచుబొట్లను నిలుపుకొన్న లేత గరికవంటి కతలివి. మన అరికాళ్లను తడిగా తడిమి తమతో పాటు నడిపించుకొని పోతాయి. కరకు ఉరుముల కెరళ్లివి. మీతోపాటు మీ చుట్టూనే బతుకుతున్న మమ్మల్నెన్నడయినా పట్టించుకొన్నారా అని మనల్ని నిలతీస్తాయి. అంత గొప్పగా చెప్పుకొన్నారు తమ బతుకుల్ని కుప్పె నాగరాజగారు
అంతరంగం కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన కుప్పె నాగరాజగారు ఈ పొత్తపు రచయిత. ఇందు లోనిదంతా వారి సొంత బతుకే. దొంబిదాసరుల బతు కులలోని పొంగులను కుంగులను, ఆటలను పాటలను, పుటకను చావును, పుటకచావుల నడుమ నడకను గుదిగుచ్చి మనముందు ఉంచినారు నాగరాజగారు. అరవై ఆరు కతల తలపుల మాలిక ఈ నోయి. ఈ కతలలో గొప్ప ఎత్తుగడలూ గొప్ప ముగింపులూ గొప్ప గొప్ప తీరులు తెన్నులు నడకలు నయగారాలు ఇవేవీ ఉండవు. అప్పుడే అమ్మకడుపు నుండి బయటపడ్డ పసికందు లాంటి కతలివి. కేరుమనే బిడ్డ తొలి పిలుపుకు కదిలే తల్లిలా మనకు తెలియకుండానే కతలవైపుకు పరుగెడతాము. మంచుబొట్లను నిలుపుకొన్న లేత గరికవంటి కతలివి. మన అరికాళ్లను తడిగా తడిమి తమతో పాటు నడిపించుకొని పోతాయి. కరకు ఉరుముల కెరళ్లివి. మీతోపాటు మీ చుట్టూనే బతుకుతున్న మమ్మల్నెన్నడయినా పట్టించుకొన్నారా అని మనల్ని నిలతీస్తాయి. అంత గొప్పగా చెప్పుకొన్నారు తమ బతుకుల్ని కుప్పె నాగరాజగారు© 2017,www.logili.com All Rights Reserved.