భూమిక
రాచరికం ఒక కాల్పనిక నవల. ఇందులో సత్యం ఏ మాత్రమూ లేదు. ఒకవేళ ఉన్నా అది సత్యపు సూచన మాత్రమే. రాయటం నాకు ఒక వ్యసనం. రాయటం నా నిరంతర వ్యక్తిగత అవసరం. నాకు ఏమి రాయాలనిపించిందో అదే రాశాను. సామాజిక బాధ్యత కళాకరుడికి వ్యక్తిగత అవసరమవుతుందా?
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 'మహానిర్వాణం' తరువాత దళిత ఉద్యమంలో అస్తవ్యస్తత తలెత్తింది. అంబేద్కర్ గారి తరువాత ఉద్యమ పగ్గాలు ఎవరు పట్టుకోవాలా అనే విషయంగా ఉద్యమం వివాదాలమయమైంది. ఈ వివాదాల కారణంగానే గత నాలుగు దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన ఉద్యమాన్ని వదులుకోవలసి వచ్చింది. ఉద్యమ నాయకత్వం కోసం పోటీలు ఏర్పడ్డాయి. 'నిజమైన నాయకుడిని నేనే, నా ఉద్యమమే నిజమైన 'ఉద్యమం' అనే నినాదాలు వినిపించసాగాయి. కొందరు ఉద్యమ అధికారాన్ని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తే, మరికొందరు అంబేద్కర్ పేరిట కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమాల సంఖ్య పెరిగింది. 'నిజమైన ఉద్యమం ఎవరిది?' అని అడగటంకన్నా 'భారీ ఉద్యమం ఎవరిది?' అనే ప్రశ్న ముఖ్యమైపోయింది. దీనివల్ల గుంపులు పెరిగాయి. ప్రతి ఒక్క గుంపు అంబేద్కర్ జయంతిని వేరువేరుగా ఆచరించసాగింది. ఒకే కూడలిలో నాలుగైదు ఉత్సవాలు జరగసాగాయి. ఈ పోటీ ఏ దశకు చేరిందంటే ఎవరి దగ్గర ఎక్కువ సొమ్ము సేకరించబడిందో తెలుసుకోవటమే ముఖ్యమైంది. ఏ ఉద్యమమైనా ప్రజల సమర్ధన లేకపోతే అది మనుగడ సాగించలేదు. ప్రజలను ఆకర్షించటానికి కొత్తకొత్త పద్ధతులు వెతకసాగారు. ప్రజల భావోద్వేగాల సమీకరణలు తయారుచేయసాగారు. ప్రజాభిప్రాయాలను నిరంతరం సంగ్రహించడం జరిగింది. రిపబ్లికన్ ఐక్యత, చైత్యభూమి,..........
భూమిక రాచరికం ఒక కాల్పనిక నవల. ఇందులో సత్యం ఏ మాత్రమూ లేదు. ఒకవేళ ఉన్నా అది సత్యపు సూచన మాత్రమే. రాయటం నాకు ఒక వ్యసనం. రాయటం నా నిరంతర వ్యక్తిగత అవసరం. నాకు ఏమి రాయాలనిపించిందో అదే రాశాను. సామాజిక బాధ్యత కళాకరుడికి వ్యక్తిగత అవసరమవుతుందా? డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 'మహానిర్వాణం' తరువాత దళిత ఉద్యమంలో అస్తవ్యస్తత తలెత్తింది. అంబేద్కర్ గారి తరువాత ఉద్యమ పగ్గాలు ఎవరు పట్టుకోవాలా అనే విషయంగా ఉద్యమం వివాదాలమయమైంది. ఈ వివాదాల కారణంగానే గత నాలుగు దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన ఉద్యమాన్ని వదులుకోవలసి వచ్చింది. ఉద్యమ నాయకత్వం కోసం పోటీలు ఏర్పడ్డాయి. 'నిజమైన నాయకుడిని నేనే, నా ఉద్యమమే నిజమైన 'ఉద్యమం' అనే నినాదాలు వినిపించసాగాయి. కొందరు ఉద్యమ అధికారాన్ని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తే, మరికొందరు అంబేద్కర్ పేరిట కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమాల సంఖ్య పెరిగింది. 'నిజమైన ఉద్యమం ఎవరిది?' అని అడగటంకన్నా 'భారీ ఉద్యమం ఎవరిది?' అనే ప్రశ్న ముఖ్యమైపోయింది. దీనివల్ల గుంపులు పెరిగాయి. ప్రతి ఒక్క గుంపు అంబేద్కర్ జయంతిని వేరువేరుగా ఆచరించసాగింది. ఒకే కూడలిలో నాలుగైదు ఉత్సవాలు జరగసాగాయి. ఈ పోటీ ఏ దశకు చేరిందంటే ఎవరి దగ్గర ఎక్కువ సొమ్ము సేకరించబడిందో తెలుసుకోవటమే ముఖ్యమైంది. ఏ ఉద్యమమైనా ప్రజల సమర్ధన లేకపోతే అది మనుగడ సాగించలేదు. ప్రజలను ఆకర్షించటానికి కొత్తకొత్త పద్ధతులు వెతకసాగారు. ప్రజల భావోద్వేగాల సమీకరణలు తయారుచేయసాగారు. ప్రజాభిప్రాయాలను నిరంతరం సంగ్రహించడం జరిగింది. రిపబ్లికన్ ఐక్యత, చైత్యభూమి,..........© 2017,www.logili.com All Rights Reserved.