విన్సెంట్ కాఫీ హౌస్ లో వెయిటర్గా ఉన్నాడు. దాని పేరు కేవలం కాఫీహౌస్. అంతే. వందేళ్ళనాటి పాతపేరు మారకపోయినా వ్యాపారం మారింది. ఇప్పుడు అదొక బార్ అండ్ రెస్టోరెంట్. అయితే మంచి కాఫీ కూడా దొరికే బార్ అండ్ రెస్టోరెంట్, మందకాంతిలో, ఇరుకైన టేబుల్స్ మధ్య కిక్కిరిసిన జనాలకు తాము ఏదో తప్పు చేస్తున్నామని అనిపించేలా మందు సమకూర్చే స్థలం ఇది కాదు. సమృద్ధిగా గాలి, వెలుతురుతో, ఎత్తయిన కప్పుతో ఉన్నటువంటి ప్రదేశం. వ్యసనంపట్ల అపరాధభావన పుట్టించని, తాగుడునూ అత్యంత సభ్యసంభ్రమమైన వ్యసనమనిపించేలా చేసే ప్రదేశం. రెస్టోరెంట్ గోడకు నేలనుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకూ చెక్కపలక కొట్టారు. గదిమధ్యలో ఉన్న పెద్దవైన చతురస్రాకార స్తంభాలకు పాత ఛాయాచిత్రాలను వేలాడదీశారు. వాటిల్లో ఈ పట్టణం వందేళ్ళ క్రితం ఎంత అందంగా ఉందో చూడవచ్చు. చిత్రాల లోపల కనిపించే విశ్రాంతికీ, కాఫీహౌసూ వివరించలేని సంబంధం ఉంది. ఉదాహరణకు, కాఫీహౌస్లో సాయంత్రం జనం రద్దీగా వున్న ఏడుగంటల సమయంలోనూ, మీరు కేవలం కప్పుకాఫీ తాగి రెండు గంటలు కూర్చున్నా ఎవరూ ఏమీ అనరు. అంతసేపు అలా కూర్చున్నవారి తలలో వేలాది చక్రాలు తిరుగుతూ ఉంటాయని వారికి తెలుసు. అలా తిరిగే చక్రాలు వాళ్ళను ఊరికే వదలవు. చివరికి వాళ్ళు తల లోపలి సుడిగాలికి లొంగిపోయి - అక్కడ వేలాడదీసిన చిత్రాల్లో కనిపించే ప్రశాంతమైన, విశాలమైన స్థలాలు..........
విన్సెంట్ కాఫీ హౌస్ లో వెయిటర్గా ఉన్నాడు. దాని పేరు కేవలం కాఫీహౌస్. అంతే. వందేళ్ళనాటి పాతపేరు మారకపోయినా వ్యాపారం మారింది. ఇప్పుడు అదొక బార్ అండ్ రెస్టోరెంట్. అయితే మంచి కాఫీ కూడా దొరికే బార్ అండ్ రెస్టోరెంట్, మందకాంతిలో, ఇరుకైన టేబుల్స్ మధ్య కిక్కిరిసిన జనాలకు తాము ఏదో తప్పు చేస్తున్నామని అనిపించేలా మందు సమకూర్చే స్థలం ఇది కాదు. సమృద్ధిగా గాలి, వెలుతురుతో, ఎత్తయిన కప్పుతో ఉన్నటువంటి ప్రదేశం. వ్యసనంపట్ల అపరాధభావన పుట్టించని, తాగుడునూ అత్యంత సభ్యసంభ్రమమైన వ్యసనమనిపించేలా చేసే ప్రదేశం. రెస్టోరెంట్ గోడకు నేలనుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకూ చెక్కపలక కొట్టారు. గదిమధ్యలో ఉన్న పెద్దవైన చతురస్రాకార స్తంభాలకు పాత ఛాయాచిత్రాలను వేలాడదీశారు. వాటిల్లో ఈ పట్టణం వందేళ్ళ క్రితం ఎంత అందంగా ఉందో చూడవచ్చు. చిత్రాల లోపల కనిపించే విశ్రాంతికీ, కాఫీహౌసూ వివరించలేని సంబంధం ఉంది. ఉదాహరణకు, కాఫీహౌస్లో సాయంత్రం జనం రద్దీగా వున్న ఏడుగంటల సమయంలోనూ, మీరు కేవలం కప్పుకాఫీ తాగి రెండు గంటలు కూర్చున్నా ఎవరూ ఏమీ అనరు. అంతసేపు అలా కూర్చున్నవారి తలలో వేలాది చక్రాలు తిరుగుతూ ఉంటాయని వారికి తెలుసు. అలా తిరిగే చక్రాలు వాళ్ళను ఊరికే వదలవు. చివరికి వాళ్ళు తల లోపలి సుడిగాలికి లొంగిపోయి - అక్కడ వేలాడదీసిన చిత్రాల్లో కనిపించే ప్రశాంతమైన, విశాలమైన స్థలాలు..........© 2017,www.logili.com All Rights Reserved.