పి.ఎన్. మూర్తి గారి ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు, అభిమతాలు, తత్వవిచారణ ఈ నవలలోని పాత్రల ద్వారా మనకి ప్రేరణ కలిగిస్తూ మనకి దగ్గరవుతాయి. అమృతంలోని సెగ- వేడిమి వివిధ రకాలు. 50 ఏళ్ల నాటి సమాజంలోని మనుషులు, వారి మనుసులు, తూకాలు నిర్ణయాలు, జీవితాలు......ఇదీ ఈ నవల మనకు అందించేది. ఈ నవలలో సమాజ చిత్రణ, విలువల పరిరక్షణ, వ్యక్తిత్వాల వైశిష్టం, సహజ, సరళ జీవన విధానం, ఎక్కడా ఉద్రేకం, సంచలనం సృష్టించక నిబ్బరంగా, పగ్గాలు పట్టి కధను నడిపించడం, దుష్టత్వం నిండిన పాత్రలకు కూడా ఒక సంజాయిషీ, వెసులుబాటుకు చోటివ్వడం వంటివి కనిపిస్తాయి. ఇవి సామాన్యమైన విషయాలు కావు. ఇందులో కథాకథనం ఎంతో హుందాగా, ఒక సమ వేగంతో సాగింది. ఎక్కడా హడావుడి లేదు. అతి మంద్రస్థాయిలో ప్రారంభమై ఒక పరాకాష్ట నందుకుని చివరికొక ప్రశాంత సరస్సు లాగా నిలిచిపోయిన ఉదంతమిది. ఇందులో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడుతూ, పాత్రోచితమైన సంభాషణా శైలిలో, నుడికారపు సొంపు మెండుగా ఉన్న నవల ఇది.
-పి. ఎన్. మూర్తి.
పి.ఎన్. మూర్తి గారి ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు, అభిమతాలు, తత్వవిచారణ ఈ నవలలోని పాత్రల ద్వారా మనకి ప్రేరణ కలిగిస్తూ మనకి దగ్గరవుతాయి. అమృతంలోని సెగ- వేడిమి వివిధ రకాలు. 50 ఏళ్ల నాటి సమాజంలోని మనుషులు, వారి మనుసులు, తూకాలు నిర్ణయాలు, జీవితాలు......ఇదీ ఈ నవల మనకు అందించేది. ఈ నవలలో సమాజ చిత్రణ, విలువల పరిరక్షణ, వ్యక్తిత్వాల వైశిష్టం, సహజ, సరళ జీవన విధానం, ఎక్కడా ఉద్రేకం, సంచలనం సృష్టించక నిబ్బరంగా, పగ్గాలు పట్టి కధను నడిపించడం, దుష్టత్వం నిండిన పాత్రలకు కూడా ఒక సంజాయిషీ, వెసులుబాటుకు చోటివ్వడం వంటివి కనిపిస్తాయి. ఇవి సామాన్యమైన విషయాలు కావు. ఇందులో కథాకథనం ఎంతో హుందాగా, ఒక సమ వేగంతో సాగింది. ఎక్కడా హడావుడి లేదు. అతి మంద్రస్థాయిలో ప్రారంభమై ఒక పరాకాష్ట నందుకుని చివరికొక ప్రశాంత సరస్సు లాగా నిలిచిపోయిన ఉదంతమిది. ఇందులో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడుతూ, పాత్రోచితమైన సంభాషణా శైలిలో, నుడికారపు సొంపు మెండుగా ఉన్న నవల ఇది. -పి. ఎన్. మూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.