ఈనాడు సమాజంలో స్త్రీలపై అనేక ఆత్యాచారాలు జరుగుతున్నాయి. మూడేళ్ళ బాలికపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు వింటున్నాం. చదువుతున్నాం. నిర్భయ జీవితంలో ఎలా ఓడిపోయిందో చదివాం, బాధపడ్డాం. ఇంత దారుణంగా సమాజం ఎందుకుంది? స్త్రీకి రక్షణ లేదా? స్వేచ్చగా జీవించే హక్కు లేదా? వాళ్ళు సమాజంలో భాగం కాదా? ఇలా అనేక ప్రశ్నలు మన ముందున్నాయి? ఇదంతా వాస్తవం.
ఈ వాస్తవాన్ని రచయిత 2010లో ఊహించాడు. స్పదించాడు. రచన చేశాడు. నవలగా 'చారులత' అనే యువతీ తనపై జరిగిన లైంగిక అత్యాచారానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎలా పోరాడి ధీర వనితగా నిలబడిందో చెప్పే నవల ఇది. ఈ నవలలో కథ కథనం, పాత్రలు, సంఘటనలు- అన్ని కల్పనలే కావచ్చు. కానీ అన్ని సమాజ సాంఘిక పరిస్థితులకు ప్రతి రూపాలు, మంచివాళ్ళు, స్వార్థపరులు, బుద్దిహినులు దగాకోరులు ఆత్మీయులు అవకాశవాదులు, మధ్యతరగతి మనుషులు ఇలా నవలంతా మనం చూస్తున్న సమాజం సజీవంగా కనబడుతుంది. వీళ్ళంతా మధ్య తరగతి వాళ్ళే సుమా. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, బ్రతుకు సమరం, భయం, మూడనమ్మకాలూ ఇలా అన్ని ఈ నవలలో ఉన్నాయి.
-పి.యస్. నారాయణ.
ఈనాడు సమాజంలో స్త్రీలపై అనేక ఆత్యాచారాలు జరుగుతున్నాయి. మూడేళ్ళ బాలికపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు వింటున్నాం. చదువుతున్నాం. నిర్భయ జీవితంలో ఎలా ఓడిపోయిందో చదివాం, బాధపడ్డాం. ఇంత దారుణంగా సమాజం ఎందుకుంది? స్త్రీకి రక్షణ లేదా? స్వేచ్చగా జీవించే హక్కు లేదా? వాళ్ళు సమాజంలో భాగం కాదా? ఇలా అనేక ప్రశ్నలు మన ముందున్నాయి? ఇదంతా వాస్తవం. ఈ వాస్తవాన్ని రచయిత 2010లో ఊహించాడు. స్పదించాడు. రచన చేశాడు. నవలగా 'చారులత' అనే యువతీ తనపై జరిగిన లైంగిక అత్యాచారానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎలా పోరాడి ధీర వనితగా నిలబడిందో చెప్పే నవల ఇది. ఈ నవలలో కథ కథనం, పాత్రలు, సంఘటనలు- అన్ని కల్పనలే కావచ్చు. కానీ అన్ని సమాజ సాంఘిక పరిస్థితులకు ప్రతి రూపాలు, మంచివాళ్ళు, స్వార్థపరులు, బుద్దిహినులు దగాకోరులు ఆత్మీయులు అవకాశవాదులు, మధ్యతరగతి మనుషులు ఇలా నవలంతా మనం చూస్తున్న సమాజం సజీవంగా కనబడుతుంది. వీళ్ళంతా మధ్య తరగతి వాళ్ళే సుమా. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, బ్రతుకు సమరం, భయం, మూడనమ్మకాలూ ఇలా అన్ని ఈ నవలలో ఉన్నాయి. -పి.యస్. నారాయణ.© 2017,www.logili.com All Rights Reserved.