సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ప్రతి వ్యక్తికి తన గమ్యం నిర్ధారించుకొని పయనం చేయటానికి ఒక ఉదాహరణ. పేదరికంలో ఉండి కూడా, పెద్ద గమ్యాలు చేరుకోవాలనే తపనకు ఒక మచ్చుతునక. తన పొట్ట నింపుకోవటం కంటే, తన తోటి పేదల పొట్టలు నింపడానికి, పెద్దలను కొల్లగొట్టం కూడా సబబేనని కత్తి పట్టిన సామాజిక నాయకుడు పాపన్న. రాజులు, వారి సామంతులయిన చిన్న, పెద్ద దొరల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కుల వృత్తి లో వాడే గీత కత్తిని వదిలి, చేతిలో పోరాట కత్తి బట్టి" తాడి చెట్టు ఎక్కితే ఏమి వస్తది అమ్మ, ముంతెడు కళ్ళు తప్ప. కొడితే గోల్కొండ కొట్టాలి. రాజు అయి సమ సమాజ స్థాపన చేయాలి" అని సమాజాన్ని కదిలించిన బహుజన విప్లవకారుడు సర్వాయి పాపన్న.
ప్రాణరావు గారు సర్దార్ సర్వాయి చరిత్రను నవల రూపంలో కండ్లకు కట్టినట్టుగా చెప్పడం వారికే సాధ్యపడింది. వారి నవల చదువుతుంటే, సినిమాలో దృశ్యాల్లా కండ్లకు కనిపించాయని చెప్పడం అతిశయోక్తి కాదు. దోపిడీనీ ఆపడానికి దోపిడి చేస్తాను అన్న పాపన్న డైలాగు పాపన్న సిద్ధాంతానికి అద్దంపడుతుంది. ప్రజల బాధలు తీర్చాలంటే రాజులు కావాలె. రాజు కావాలంటే ఆయుధాలు ఉండాలె, ఆయుధాలు కొనాలంటే డబ్బు కావలె. వాటి కొరకు దోపిడీ తప్పదు అన్న నినాదం నాటి రాజుల నుండి, నేటి రాజకీయాల వరకు డబ్బు అవసరం తెలియజేస్తుంది. కచ్చితంగా "ప్రజాజ్యోతి - పాపన్న" నవలలో ప్రాణరావు తన అక్షర నైపుణ్యంతో పాపన్నకు మళ్ళీ ప్రాణం పోసినట్లు అయింది.
- డా. బుర్రా నర్సయ్య గౌడ్
సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ప్రతి వ్యక్తికి తన గమ్యం నిర్ధారించుకొని పయనం చేయటానికి ఒక ఉదాహరణ. పేదరికంలో ఉండి కూడా, పెద్ద గమ్యాలు చేరుకోవాలనే తపనకు ఒక మచ్చుతునక. తన పొట్ట నింపుకోవటం కంటే, తన తోటి పేదల పొట్టలు నింపడానికి, పెద్దలను కొల్లగొట్టం కూడా సబబేనని కత్తి పట్టిన సామాజిక నాయకుడు పాపన్న. రాజులు, వారి సామంతులయిన చిన్న, పెద్ద దొరల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కుల వృత్తి లో వాడే గీత కత్తిని వదిలి, చేతిలో పోరాట కత్తి బట్టి" తాడి చెట్టు ఎక్కితే ఏమి వస్తది అమ్మ, ముంతెడు కళ్ళు తప్ప. కొడితే గోల్కొండ కొట్టాలి. రాజు అయి సమ సమాజ స్థాపన చేయాలి" అని సమాజాన్ని కదిలించిన బహుజన విప్లవకారుడు సర్వాయి పాపన్న. ప్రాణరావు గారు సర్దార్ సర్వాయి చరిత్రను నవల రూపంలో కండ్లకు కట్టినట్టుగా చెప్పడం వారికే సాధ్యపడింది. వారి నవల చదువుతుంటే, సినిమాలో దృశ్యాల్లా కండ్లకు కనిపించాయని చెప్పడం అతిశయోక్తి కాదు. దోపిడీనీ ఆపడానికి దోపిడి చేస్తాను అన్న పాపన్న డైలాగు పాపన్న సిద్ధాంతానికి అద్దంపడుతుంది. ప్రజల బాధలు తీర్చాలంటే రాజులు కావాలె. రాజు కావాలంటే ఆయుధాలు ఉండాలె, ఆయుధాలు కొనాలంటే డబ్బు కావలె. వాటి కొరకు దోపిడీ తప్పదు అన్న నినాదం నాటి రాజుల నుండి, నేటి రాజకీయాల వరకు డబ్బు అవసరం తెలియజేస్తుంది. కచ్చితంగా "ప్రజాజ్యోతి - పాపన్న" నవలలో ప్రాణరావు తన అక్షర నైపుణ్యంతో పాపన్నకు మళ్ళీ ప్రాణం పోసినట్లు అయింది. - డా. బుర్రా నర్సయ్య గౌడ్© 2017,www.logili.com All Rights Reserved.