రావిశాస్త్రిగారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "రత్తాలు - రాంబాబు" లో వేశ్యావ్యవస్థని పెంచి పోషిస్తున్న పెట్టుబడీదారీ వికృత స్వరూపాన్ని చిత్రించారు.
వేశ్యావ్యవస్థని రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ రచించిన 'యామా ది పిట్' నవల ఎక్సరేనే కాక స్కానింగ్ చేసి చూపించిందని చెప్పొచ్చు. రావిశాస్త్రిగారి రత్తాలు - రాంబాబు కూడా ఈ కోవలోనేదే, దీనికి దీటయినదే. వేశ్యావ్యవ్యవస్థ ఎన్నెన్ని రకాలుగా ఘనీభవిస్తున్నదో, దాని చుట్టూ ఎన్నెన్ని రంగుల వలలు కుమ్ముకున్నాయో చూపించారాయన. ఆ మాట కొస్తే వేశ్యావ్యవస్థని పెంచి పోషించేది ఈ ధనస్వామ్య వ్యాపార వ్యవస్థేనని ఆయన నగ్నంగా చూపించారు.
రావిశాస్త్రిగారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "రత్తాలు - రాంబాబు" లో వేశ్యావ్యవస్థని పెంచి పోషిస్తున్న పెట్టుబడీదారీ వికృత స్వరూపాన్ని చిత్రించారు. వేశ్యావ్యవస్థని రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ రచించిన 'యామా ది పిట్' నవల ఎక్సరేనే కాక స్కానింగ్ చేసి చూపించిందని చెప్పొచ్చు. రావిశాస్త్రిగారి రత్తాలు - రాంబాబు కూడా ఈ కోవలోనేదే, దీనికి దీటయినదే. వేశ్యావ్యవ్యవస్థ ఎన్నెన్ని రకాలుగా ఘనీభవిస్తున్నదో, దాని చుట్టూ ఎన్నెన్ని రంగుల వలలు కుమ్ముకున్నాయో చూపించారాయన. ఆ మాట కొస్తే వేశ్యావ్యవస్థని పెంచి పోషించేది ఈ ధనస్వామ్య వ్యాపార వ్యవస్థేనని ఆయన నగ్నంగా చూపించారు.© 2017,www.logili.com All Rights Reserved.