రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. 'ఆరు సారా కథలు' తెలుగు సాహిత్యంలో గొప్ప సంచలనం. రావిశాస్త్రిగారు ఈ సార కథల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎండగట్టారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం అసలు పని సొంత ఆస్తికి పోలీసు కాపలా కాయడమేనని ఇందులో నొక్కి చెప్పారు. ఈ 'నాలుగార్లు' ప్రచురణలో కొన్ని కథలు ఎప్పుడు ఎక్కడ ప్రచురితమయ్యాయో తెలియలేదు. ఇందులోని 'ఆరు సారా కథలు' మరో 'ఆరు చిత్రాలు' నాన్నగారు 'జాస్మిన్' అనే కలం పేరుతో రాశారు.
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. 'ఆరు సారా కథలు' తెలుగు సాహిత్యంలో గొప్ప సంచలనం. రావిశాస్త్రిగారు ఈ సార కథల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎండగట్టారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం అసలు పని సొంత ఆస్తికి పోలీసు కాపలా కాయడమేనని ఇందులో నొక్కి చెప్పారు. ఈ 'నాలుగార్లు' ప్రచురణలో కొన్ని కథలు ఎప్పుడు ఎక్కడ ప్రచురితమయ్యాయో తెలియలేదు. ఇందులోని 'ఆరు సారా కథలు' మరో 'ఆరు చిత్రాలు' నాన్నగారు 'జాస్మిన్' అనే కలం పేరుతో రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.