ఉత్సవం
దశరథరామయ్య పూజాదికాలు ముగించుకుని టీవీ పెట్టారు.
చాగంటి వారి ప్రవచనం వస్తోంది.
వీధి అరుగుమీది పడక్కుర్చీలో కూర్చుని వినసాగారు. టీవీలో చూడటం కన్నా, రేడియోలా వినడమే ఆయనకు ఇష్టం. రూపం మీద గాక భావం మీద ఏకాగ్రత కుదురుతుందని భావిస్తారు.
"..... రామో విగ్రహవాన్ ధర్మ: అన్నారు. శ్రీరాముడు ధర్మానికి విగ్రహం వంటివారు. అనగా ధర్మస్వరూపుడు. ఈ మాట ఎవరు చెప్పారు? అయోధ్య ప్రజలూ, ఋషులూ కాదు, మారీచుడు. అవును. రాక్షసుడు, మాయావి, శత్రువు అయిన అతడే రాముణ్ణి అలా ప్రస్తుతించాడు. ఎవరితో చెప్పాడు? రావణుడితో. పిల్ల రాక్షసుడు పెద్ద రాక్షసుడితో చెప్పాడన్నమాట. రావణుడు విన్నాడా? ఊహు. లేదు. వింటే రామాయణం ఇంకోలా ఉండేది...."
ప్రవచనం వింటూ, తలూపుతూ ఆలోచిస్తున్నారు దశరథరామయ్య. రామస్వరూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకుంటూ మనస్సులో మోకరిల్లుతున్నారు.
"నమస్కారం దశరథరామయ్యగారూ” అంటూ వచ్చారు గ్రామ పెద్దలు సుబ్బారాయుడు, వీర్రాజు, ఆనందరావు.
"రండి రండి. పొద్దుటే వచ్చారు, ఏవిటి విశేషం?”
కుర్చీల్లో కూర్చుంటూ అన్నారు. "విశేషం అని కాదు, వూరికే వచ్చాం. మీరు గ్రామపెద్దగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే నడిచింది. ఎవరూ మీ మాట కాదనేవారు కాదు...."
సుబ్బరాయుడి మాటలకు చిన్నగా నవ్వారాయన....................
ఉత్సవం దశరథరామయ్య పూజాదికాలు ముగించుకుని టీవీ పెట్టారు. చాగంటి వారి ప్రవచనం వస్తోంది. వీధి అరుగుమీది పడక్కుర్చీలో కూర్చుని వినసాగారు. టీవీలో చూడటం కన్నా, రేడియోలా వినడమే ఆయనకు ఇష్టం. రూపం మీద గాక భావం మీద ఏకాగ్రత కుదురుతుందని భావిస్తారు. "..... రామో విగ్రహవాన్ ధర్మ: అన్నారు. శ్రీరాముడు ధర్మానికి విగ్రహం వంటివారు. అనగా ధర్మస్వరూపుడు. ఈ మాట ఎవరు చెప్పారు? అయోధ్య ప్రజలూ, ఋషులూ కాదు, మారీచుడు. అవును. రాక్షసుడు, మాయావి, శత్రువు అయిన అతడే రాముణ్ణి అలా ప్రస్తుతించాడు. ఎవరితో చెప్పాడు? రావణుడితో. పిల్ల రాక్షసుడు పెద్ద రాక్షసుడితో చెప్పాడన్నమాట. రావణుడు విన్నాడా? ఊహు. లేదు. వింటే రామాయణం ఇంకోలా ఉండేది...." ప్రవచనం వింటూ, తలూపుతూ ఆలోచిస్తున్నారు దశరథరామయ్య. రామస్వరూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకుంటూ మనస్సులో మోకరిల్లుతున్నారు. "నమస్కారం దశరథరామయ్యగారూ” అంటూ వచ్చారు గ్రామ పెద్దలు సుబ్బారాయుడు, వీర్రాజు, ఆనందరావు. "రండి రండి. పొద్దుటే వచ్చారు, ఏవిటి విశేషం?” కుర్చీల్లో కూర్చుంటూ అన్నారు. "విశేషం అని కాదు, వూరికే వచ్చాం. మీరు గ్రామపెద్దగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే నడిచింది. ఎవరూ మీ మాట కాదనేవారు కాదు...." సుబ్బరాయుడి మాటలకు చిన్నగా నవ్వారాయన....................© 2017,www.logili.com All Rights Reserved.