ఆమె పుట్టకముందే ఆమె కోసం ఎర్ర తివాచీ పరచి ఉంచారు. పుట్టాక, 'యువరాణివి' అన్నారు. ఆ పిమ్మట
చిత్రంగా ఆమె పనికిరాని 'బొమ్మ' అయిపోయింది. తల్లిపేగు అడ్డు పడకపోయి ఉంటే నిర్దాక్షిణ్యంగా విసిరి పారేసేవారేమో!
అడుగడుగునా అనాదరణ! ఆంక్షలు ! ఆశల్ని త్రుంచేవాళ్ళు! రెక్కల్ని కత్తిరించాలని చూసే పరిస్థితులు!
అయినా ఆమె తనకు తాను కొత్తగా విత్తుకుంది. గుండెల నిండా 'ఆశ' పీల్చుకుంది. చిగురుటాకుల రెక్కలు
చాచింది. తలెత్తి నిలబడింది. తలమానికమై నిలిచింది.
ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం, ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఓ ఆడపిల్ల తను గెలవడమే గాక
తనవారినీ గెలిపించింది. వేయి పూలు వికసించడానికి తన రెండు చేతులూ అడ్డు పెట్టింది!
సింహప్రసాద్ స్ఫూర్తిదాకమైన నవల
"నేను సైతం".
ఆమె పుట్టకముందే ఆమె కోసం ఎర్ర తివాచీ పరచి ఉంచారు. పుట్టాక, 'యువరాణివి' అన్నారు. ఆ పిమ్మట చిత్రంగా ఆమె పనికిరాని 'బొమ్మ' అయిపోయింది. తల్లిపేగు అడ్డు పడకపోయి ఉంటే నిర్దాక్షిణ్యంగా విసిరి పారేసేవారేమో! అడుగడుగునా అనాదరణ! ఆంక్షలు ! ఆశల్ని త్రుంచేవాళ్ళు! రెక్కల్ని కత్తిరించాలని చూసే పరిస్థితులు! అయినా ఆమె తనకు తాను కొత్తగా విత్తుకుంది. గుండెల నిండా 'ఆశ' పీల్చుకుంది. చిగురుటాకుల రెక్కలు చాచింది. తలెత్తి నిలబడింది. తలమానికమై నిలిచింది. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం, ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఓ ఆడపిల్ల తను గెలవడమే గాక తనవారినీ గెలిపించింది. వేయి పూలు వికసించడానికి తన రెండు చేతులూ అడ్డు పెట్టింది! సింహప్రసాద్ స్ఫూర్తిదాకమైన నవల "నేను సైతం".© 2017,www.logili.com All Rights Reserved.