“ఎవరింటికెళ్ళినా, మా కోడలు కంప్యూటర్ ఇంజనీరు, మా అమ్మాయి ప్రాజెక్ట్ మేనేజరు. మా కోడలు అమెరికా వెళ్ళింది, మా అమ్మాయి జపాన్ వెళ్ళింది," అంటూ చెప్పుతుంటే రాబోయే కోడలి గురించి ఆ లెవెల్లో చెప్పుకోవాలని ఊహాలోకంలో విహరించే తల్లి. అందుకు భిన్నంగా ఈ తరంలో కూడా ఇల్లు కుటుంబము అంటూ పాకులాడే కొడుకు. "పాపం బిడ్డలు, ఈ వెధవ ఉద్యోగాలతో ఎంత అల్లాడిపోతున్నారో? కనీసం కోడలైనా ఊళ్ళో ఉంటూ పిల్లలిని చూసుకునే ఉద్యోగంలో ఉంటే బాగుణ్ణు. పసివెధవలని హాస్టళ్ళల్లో పెట్టి కంటికి కనిపించకుండా చేశారు. అంటూ మానసికవ్యధలో పడే ఇల్లాళ్ళు. పుట్టింట నేర్పిన సాంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలు, అత్తింట కూడా చూపి అందరి ఆదరణను పొందిన ఇల్లాలు సంధ్య. సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్య కాలంలో చోటు చేసుకున్న సంధ్యారాగ సమాహారమే ఈ నవల సారాంశము.
- పోలంరాజు శారద
“ఎవరింటికెళ్ళినా, మా కోడలు కంప్యూటర్ ఇంజనీరు, మా అమ్మాయి ప్రాజెక్ట్ మేనేజరు. మా కోడలు అమెరికా వెళ్ళింది, మా అమ్మాయి జపాన్ వెళ్ళింది," అంటూ చెప్పుతుంటే రాబోయే కోడలి గురించి ఆ లెవెల్లో చెప్పుకోవాలని ఊహాలోకంలో విహరించే తల్లి. అందుకు భిన్నంగా ఈ తరంలో కూడా ఇల్లు కుటుంబము అంటూ పాకులాడే కొడుకు. "పాపం బిడ్డలు, ఈ వెధవ ఉద్యోగాలతో ఎంత అల్లాడిపోతున్నారో? కనీసం కోడలైనా ఊళ్ళో ఉంటూ పిల్లలిని చూసుకునే ఉద్యోగంలో ఉంటే బాగుణ్ణు. పసివెధవలని హాస్టళ్ళల్లో పెట్టి కంటికి కనిపించకుండా చేశారు. అంటూ మానసికవ్యధలో పడే ఇల్లాళ్ళు. పుట్టింట నేర్పిన సాంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలు, అత్తింట కూడా చూపి అందరి ఆదరణను పొందిన ఇల్లాలు సంధ్య. సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్య కాలంలో చోటు చేసుకున్న సంధ్యారాగ సమాహారమే ఈ నవల సారాంశము. - పోలంరాజు శారద
© 2017,www.logili.com All Rights Reserved.