ఆర్ధిక వ్యవస్థల పరిపుష్టికి, వ్యక్తుల అభివృద్ధికి కొత్త ప్రపంచాన్ని, కొత్త ప్రదేశాల్నే ఎన్నుకోనక్ఖర్లేదు. పాత ప్రపంచాన్ని, పాత ప్రదేశాల్నే కొత్త దృష్టితో చూడగలిగితే చాలు. ఇదే ఈ నవలకు ఆధారం. ఆయిల్ సంక్షోభం వర్థమాన దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని, ప్రజల స్థితి గతుల్ని ఎంతగా అతలా కుతలం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ముందుగా అర్ధం చేసుకొని ఆచరణలోకి దిగిన దేశం జపాన్. ప్రస్తుతం జపాన్ ఆటోమొబైల్ కంపెనీల రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ లో లైట్స్ విశ్రాంతి తీసుకోవటం లేదు. వాటిల్లో పరిశోధనలు జరిపే శాస్త్రజ్ఞులు తమ పూర్తీ కాలాన్ని ఆయిల్ అవసరం లేకుండా నడపగల కార్లను కనుగొనే ప్రయత్నంలో అహర్నిశలు పరిశ్రమిస్తున్నారు. ఏ కంపెనీ ముందుగా అలాంటి కారుని కనిపెడుతుందో - ఆ కంపెనీయే వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని, దేశ దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని శాసించగలుగుతుంది.
జపాన్ లోని ప్రతి ఆటోమొబైల్ కంపెనీ తమ ఆర్ అండ్ డి వింగ్ కి పటిష్టమైన రక్షణ విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. బ్లూ ప్రింట్స్ - డిజైన్ సీక్రెట్స్ బయటకు పోకుండా ఉండేందుకు శాస్త్రజ్ఞుల కుటుంబాల్ని తమ కంపెనీల ఆవరణలోనే ఉంచే ఏర్పాట్లు చేసుకున్నాయి. అక్కడ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయటం జరిగింది. ప్రపంచం అంతా ఇప్పుడు జపాన్ పరిశోధనా ఫలితాలకేసే ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇండియాలోనే అలాంటి ప్రయోగం ఒక యువకుడు చేసి విజయం సాధించి ప్రపంచ దేశాల గుర్తింపును పొందితే ఎంత గొప్పగా ఉంటుందన్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ నవల.
- సూర్యదేవర రామ్ మోహనరావు
ఆర్ధిక వ్యవస్థల పరిపుష్టికి, వ్యక్తుల అభివృద్ధికి కొత్త ప్రపంచాన్ని, కొత్త ప్రదేశాల్నే ఎన్నుకోనక్ఖర్లేదు. పాత ప్రపంచాన్ని, పాత ప్రదేశాల్నే కొత్త దృష్టితో చూడగలిగితే చాలు. ఇదే ఈ నవలకు ఆధారం. ఆయిల్ సంక్షోభం వర్థమాన దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని, ప్రజల స్థితి గతుల్ని ఎంతగా అతలా కుతలం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ముందుగా అర్ధం చేసుకొని ఆచరణలోకి దిగిన దేశం జపాన్. ప్రస్తుతం జపాన్ ఆటోమొబైల్ కంపెనీల రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ లో లైట్స్ విశ్రాంతి తీసుకోవటం లేదు. వాటిల్లో పరిశోధనలు జరిపే శాస్త్రజ్ఞులు తమ పూర్తీ కాలాన్ని ఆయిల్ అవసరం లేకుండా నడపగల కార్లను కనుగొనే ప్రయత్నంలో అహర్నిశలు పరిశ్రమిస్తున్నారు. ఏ కంపెనీ ముందుగా అలాంటి కారుని కనిపెడుతుందో - ఆ కంపెనీయే వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని, దేశ దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని శాసించగలుగుతుంది. జపాన్ లోని ప్రతి ఆటోమొబైల్ కంపెనీ తమ ఆర్ అండ్ డి వింగ్ కి పటిష్టమైన రక్షణ విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. బ్లూ ప్రింట్స్ - డిజైన్ సీక్రెట్స్ బయటకు పోకుండా ఉండేందుకు శాస్త్రజ్ఞుల కుటుంబాల్ని తమ కంపెనీల ఆవరణలోనే ఉంచే ఏర్పాట్లు చేసుకున్నాయి. అక్కడ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయటం జరిగింది. ప్రపంచం అంతా ఇప్పుడు జపాన్ పరిశోధనా ఫలితాలకేసే ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇండియాలోనే అలాంటి ప్రయోగం ఒక యువకుడు చేసి విజయం సాధించి ప్రపంచ దేశాల గుర్తింపును పొందితే ఎంత గొప్పగా ఉంటుందన్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ నవల. - సూర్యదేవర రామ్ మోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.