డా.వి.వి.కృష్ణశాస్త్రి 1934 అక్టోబరు 23న కృష్ణాజిల్ల చిరివాడలో జన్మించారు. 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురాతత్వశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1992లో డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రదేశంలో నాగార్జునకొండ,బావికొండ,తొట్లకొండ మొదలైన చోట్ల త్రవ్వకాలను నిర్వహించి పురావస్తుసేకరణ జరిపి ఆంధ్రదేశ చరిత్ర నిర్మాణానికి విస్తృతమైన సేవ చేశారు.
శాస్త్రీయమైన త్రవ్వకాల ద్వారా కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,రంగారెడ్డి మొదలైన జిల్లాలలో రాతియుగం నాటి తెలుగు వారి చరిత్రని త్రవ్వి తట్టల కెత్తించిన వారు కృష్ణశాస్త్రిగారు. తెలుగుజాతి చరిత్రకు సాక్ష్యాలను తేవటం,వాటిని పరిరక్షించటం, వెలుగులోకి తెచ్చిన వాటిని సులభశైలిలో సామాన్య మానవుడికి అందించడం లాంటి ఒక చరిత్రకారుది కర్తవ్యాలను అనితర సాధ్యంగా నిర్వహించినవారు కృష్ణశాస్త్రిగారు.
డా.వి.వి.కృష్ణశాస్త్రి 1934 అక్టోబరు 23న కృష్ణాజిల్ల చిరివాడలో జన్మించారు. 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురాతత్వశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1992లో డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రదేశంలో నాగార్జునకొండ,బావికొండ,తొట్లకొండ మొదలైన చోట్ల త్రవ్వకాలను నిర్వహించి పురావస్తుసేకరణ జరిపి ఆంధ్రదేశ చరిత్ర నిర్మాణానికి విస్తృతమైన సేవ చేశారు. శాస్త్రీయమైన త్రవ్వకాల ద్వారా కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,రంగారెడ్డి మొదలైన జిల్లాలలో రాతియుగం నాటి తెలుగు వారి చరిత్రని త్రవ్వి తట్టల కెత్తించిన వారు కృష్ణశాస్త్రిగారు. తెలుగుజాతి చరిత్రకు సాక్ష్యాలను తేవటం,వాటిని పరిరక్షించటం, వెలుగులోకి తెచ్చిన వాటిని సులభశైలిలో సామాన్య మానవుడికి అందించడం లాంటి ఒక చరిత్రకారుది కర్తవ్యాలను అనితర సాధ్యంగా నిర్వహించినవారు కృష్ణశాస్త్రిగారు.© 2017,www.logili.com All Rights Reserved.