శివాని, రమ్య ఒకే ఆఫీసులో కొలీగ్స్. ఒకరు కంప్యూటర్ ఆపరేటర్, మరొకరు రిసెప్షనిస్ట్. శివాని మితభాషి. డ్యూటీమైండెడ్. మెడలో సన్నటి చైను, ఎడం చేతికి రిష్టువాచి కుడిచేతికి రెండు గాజులతో సింపుల్ గా ఉన్నా చూడముచ్చటగా ఉంటుంది. ఎర్రగా స్లిమ్ గా ఉండే ఆమె ఎప్పుడు వాయల్ చీరలే కడుతుంది. ఇక రమ్య - ఆమె అలంకరణ, ఆడంబరంగా ఉంటుంది. పంజాబీ డ్రెస్, చూడీదార్, మేక్సీ, మిడ్డీ ఇలా రోజుకో డ్రెస్సు ధరిస్తుంది. రకరకాల ఫేషియల్ క్రీమ్స్ వాడుతూ, పెదాలకు లిప్ స్టిక్ పూసుకొని, పొట్టిగా వొత్తుగా వున్న కేశాల్ని పోనీటేలుగా మలచుకొని హైహీల్ షూలో టిప్ టాప్ గా కనిపిస్తుంది. ఆ పోస్టుకు తగ్గ అలంకరణ ఉండబట్టే కంపెనీ వాళ్ళు ఆమెను రిసెప్షనిస్టుగా రిక్రూట్ చేసుకున్నారు.
ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములువాడి అన్న చందంగా రమ్య కంటే సర్వీసులో ఆలస్యంగా అడుగుపెట్టిన శివానీకే ఆ సంస్థలో ఎక్కువ గుర్తింపు లభించడం రమ్య జీర్ణించు కోలేకపోయింది. అసూయ ఉన్నా బయట పడకుండా పెదాల మీద చిరునవ్వు పులుముకొని కబుర్లాడుతోంది. తను వినయ్ దృష్టిలో పాడేందుకు శాతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. శివాని మౌనంగా వున్నా ఆమెనే తరచూ తన ఛాంబర్ కి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు వినయ్. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవాల్సిందే.
- దూరి వెంకటరావు
శివాని, రమ్య ఒకే ఆఫీసులో కొలీగ్స్. ఒకరు కంప్యూటర్ ఆపరేటర్, మరొకరు రిసెప్షనిస్ట్. శివాని మితభాషి. డ్యూటీమైండెడ్. మెడలో సన్నటి చైను, ఎడం చేతికి రిష్టువాచి కుడిచేతికి రెండు గాజులతో సింపుల్ గా ఉన్నా చూడముచ్చటగా ఉంటుంది. ఎర్రగా స్లిమ్ గా ఉండే ఆమె ఎప్పుడు వాయల్ చీరలే కడుతుంది. ఇక రమ్య - ఆమె అలంకరణ, ఆడంబరంగా ఉంటుంది. పంజాబీ డ్రెస్, చూడీదార్, మేక్సీ, మిడ్డీ ఇలా రోజుకో డ్రెస్సు ధరిస్తుంది. రకరకాల ఫేషియల్ క్రీమ్స్ వాడుతూ, పెదాలకు లిప్ స్టిక్ పూసుకొని, పొట్టిగా వొత్తుగా వున్న కేశాల్ని పోనీటేలుగా మలచుకొని హైహీల్ షూలో టిప్ టాప్ గా కనిపిస్తుంది. ఆ పోస్టుకు తగ్గ అలంకరణ ఉండబట్టే కంపెనీ వాళ్ళు ఆమెను రిసెప్షనిస్టుగా రిక్రూట్ చేసుకున్నారు. ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములువాడి అన్న చందంగా రమ్య కంటే సర్వీసులో ఆలస్యంగా అడుగుపెట్టిన శివానీకే ఆ సంస్థలో ఎక్కువ గుర్తింపు లభించడం రమ్య జీర్ణించు కోలేకపోయింది. అసూయ ఉన్నా బయట పడకుండా పెదాల మీద చిరునవ్వు పులుముకొని కబుర్లాడుతోంది. తను వినయ్ దృష్టిలో పాడేందుకు శాతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. శివాని మౌనంగా వున్నా ఆమెనే తరచూ తన ఛాంబర్ కి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు వినయ్. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవాల్సిందే. - దూరి వెంకటరావు© 2017,www.logili.com All Rights Reserved.