ఇందులో 18 కధలున్నాయి. వాటిలో 11 కధలు "కేపిటల్ కధలు" పేరుతో విజయనగరం నుండి వెలువడుతున్న "నాని" మాసపత్రికలో కొన్ని నెలల పాటు వచ్చాయి. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించే కధలు మూడు. ఇతర విషయాలకు సంబంధించినవి నాలుగు. కేపిటల్ కధలు అంటే కార్ల్ మర్క్స్ రాసిన కేపిటలే. మర్క్స్ జర్మనీ దేశస్థుడు. మానవులకు, మానవ సమాజం గురించి తెలుసుకోవడానికి మించిన గ్న్యానo వుండదు. అటువంటి మానవ సమాజం గురించీ, మనుషుల మద్య శ్రమ సంబంధాల గురించీ, శ్రమ దోపిడీ గురించీ శాస్త్రీయంగా లెక్కలతో సహా వివరించిన పుస్తకం "కేపిటల్".
"కేపిటల్" పుస్తకం మొదట జర్మన్ భాషలో వచ్చింది. తరువాత ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదాలు వచ్చాయి. మిగతా భాషల సంగతి ఎలా వున్నా, మన తెలుగులో రంగనాయకమ్మగారు అత్యంత సరళంగా, చక్కని వ్యవహారిక భాషలో పరిచయం చేసారు.
- వి వెంకట్రావు