మానవ జీవితంలో ఒక తరానికి, మరొక తరానికి అంతరం సహజం. ప్రతి వ్యక్తి జీవిత పరిణామక్రమంలో బాల్య, యౌవ్వన, కౌమార, వార్ధక్య దశలుంటాయి. మొదటి తరం వ్యక్తులు వార్ధక్యంలో ఉన్నప్పుడు, రెండవ తరం కౌమారంలో, మూడవ తరం బాల్య యౌవ్వన దశలలో ఉంటారు. బాల్యంలోని, యౌవ్వనంలోని ఆలోచనలకు ఆశయాలకు, కౌమార దశల్లోని ఆలోచనా సరళికి కర్తవ్యాలకు తేడా ఉంటుంది. ఈ క్రమంలో వార్ధక్యపు శారీరక మానసిక స్థితిగతులు అనేక మార్పులను సంతరించుకుంటాయి. ఇదంతా జీవుడు ప్రకృతి మధ్య జరిగే బేరసారాలు, స్పందన ప్రతిస్పందనలు. ఈ తేడాలను అధిగమించేందుకు, ప్రకృతి విధించే చట్టాలను ధిక్కరించకుండా వయస్సుకు తగిన రీతిలో నడుచుకుంటే ఆవేదనభరిత జీవితాల సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. అందుకే శంకరుడు 'సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త' అని బోధించాడు. సంసారం సమస్య మానవునికి మాత్రమే వుంటుంది. మిగతా జీవులు తమ సంతతి యెడల అనుసరించవలసిన కర్తవ్యాన్ని పూర్తిచేసి చేతులు దులుపుకుంటాయి. కాని మనం భార్య బిడ్డలకు జీవితాంతం అతుక్కొని ఉండాలనే ఆశతో గాలానికి తగులుకునే చేపలలా బ్రతుకుతుంటాము. దీనికి చెలియలికట్ట లేదనిపిస్తుంది. ఈ నవల ఇతివృత్తం నేటి తరాల అంతరాలను తెలియజేయడమే.
- ఆచార్య శేషయ్య కందమూరు