మంచి చెడ్డలు యుగయుగాలుగా ప్రకృతిలో ఇమిడి ఉండే నైస్వర్గిక స్వరూపాలు. మానవులు దేవతలుగా రాక్షసులుగా ప్రవర్తిస్తూ, బలవంతుడు చెప్పినది చేసినది ధర్మం అని జరిగిన క్రమంలో, కొంతమంది త్యాగధనులు కొత్త ఆలోచనలను ఆవిష్కరించి నందున సామాజిక రాజకీయ వ్యవస్థలలో పెనుమార్పులు చోటుచేసుకోవడం విదితమే. కాని ఒకసారి ధర్మం అధర్మంపై గెలుపు సాధిస్తే, మరొకసారి అధర్మం ధర్మంపై గెలుపు సాధించడం చరిత్రలో అనేక సంఘటనల ద్వారా ఋజువు అవుతున్నదే. ఈ కారణంగా ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతుండడం, కొంతమంది కొంతకాలం సుఖాన్ని అనుభవించడం, మిగతావాళ్ళు దుఃఖానికి లోనుకావడం సహజమైంది. ఈ వ్యవస్థలో మార్పులను చేర్పులను చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాల ఫలితమే బానిస వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు మానవాళి చేరుకోవడం ఒక పెద్ద విజయం. ఈ సమాజాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి రాజ్యాంగానికి చట్టాలకు వ్యవస్థలకూ మెరుగులుదిద్ది, వ్యక్తులు ప్రేమను పుణికి పుచ్చుకొని త్యాగాన్ని లక్ష్యంగా మార్చుకోవడానికి అవకాశాన్ని వాతావరణాన్ని కల్పించుకోగలిగితే 'సర్వేజనాః సుఖినోభవస్తు', సమస్త సన్మంగళానిభవస్తు' అన్న లక్ష్యానికి చేరువ కావచ్చు. ఈ రచనకు పునాది ఈ ఆలోచన.
- ఆచార్య శేషయ్య కందమూరు