టప్ టప్ టప్ టప్ టప్ ...........
చినుకులు రాల్చుతూ నెమ్మదిగా మబ్బులు నల్లబారి చట్టంగా మారుతున్నాయి. మండుటెండల ఈ 'వేసంగిపురం'ను 'సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం' అని అంటే అతిశయోక్తి కాదు.
గొల్డెపిల్లను మింగిన అలసటతో సంతృప్తి, నిర్లక్ష్యం కలగలిసిన కొండచిలువలా, ఈ ప్రదేశంలో మండుటెండలు ఎప్పుడూ ఒళ్లు చాపుకుని పడుకుని వుంటాయి. చుట్టూ కోటలా ఉన్న కొండలు కూడా ఈ ఎండ తీవ్రతను రెట్టింపు చేసేలా ఆవరించుకుని గొప్ప మౌనాన్ని నటిస్తో నిలుచుని వుంటాయి. వేసవి. తీవ్రమైన వేసవి అని ఏడాదిని రెండు భాగాలుగా విభజించుకుని విజృంభించటాన్ని చూసి, అలవాటైన పెద్దలు 'రాజు పోయి రాజకీయ నాయకుడు వచ్చాడు. అంతే. ఊరి అభివృద్ధి విషయానికి వస్తే అతను అబ్బయితే, ఇప్పటివాడు 'వాడి అబ్బు' అని చెప్పి ఆ ఊరి దురదృష్టాన్ని నిందిస్తూ బొకబొళమని కఫం తోసుకొచ్చినట్లు దగ్గుతూ కాండ్రించి ఉమ్ముతారు. కోపంతో రెచ్చిపోయిన పాములా, ఎప్పుడూ బుసలు కొట్టే ఎండ 'హిస్' అనే తన ప్రతి బుసకు రోడ్లమీద దుమ్ము మేఘాలను రేపుతుంది. ట్రాక్టర్లు, లారీలు, బస్సులు లాంటివి దాటి వెళ్లేటప్పుడు కూడా వాటి వెనుక రోడ్డు కనిపించకుండా పోతుంది. తీవ్రమైన ఎండలకు నిప్పుల్లా కాలిన నేల మీది మట్టి పిండి పిండై, చిన్నగా నున్నటి పొడి రూపంలో ముక్కు నుంచి.............
టప్ టప్ టప్ టప్ టప్ ........... చినుకులు రాల్చుతూ నెమ్మదిగా మబ్బులు నల్లబారి చట్టంగా మారుతున్నాయి. మండుటెండల ఈ 'వేసంగిపురం'ను 'సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం' అని అంటే అతిశయోక్తి కాదు. గొల్డెపిల్లను మింగిన అలసటతో సంతృప్తి, నిర్లక్ష్యం కలగలిసిన కొండచిలువలా, ఈ ప్రదేశంలో మండుటెండలు ఎప్పుడూ ఒళ్లు చాపుకుని పడుకుని వుంటాయి. చుట్టూ కోటలా ఉన్న కొండలు కూడా ఈ ఎండ తీవ్రతను రెట్టింపు చేసేలా ఆవరించుకుని గొప్ప మౌనాన్ని నటిస్తో నిలుచుని వుంటాయి. వేసవి. తీవ్రమైన వేసవి అని ఏడాదిని రెండు భాగాలుగా విభజించుకుని విజృంభించటాన్ని చూసి, అలవాటైన పెద్దలు 'రాజు పోయి రాజకీయ నాయకుడు వచ్చాడు. అంతే. ఊరి అభివృద్ధి విషయానికి వస్తే అతను అబ్బయితే, ఇప్పటివాడు 'వాడి అబ్బు' అని చెప్పి ఆ ఊరి దురదృష్టాన్ని నిందిస్తూ బొకబొళమని కఫం తోసుకొచ్చినట్లు దగ్గుతూ కాండ్రించి ఉమ్ముతారు. కోపంతో రెచ్చిపోయిన పాములా, ఎప్పుడూ బుసలు కొట్టే ఎండ 'హిస్' అనే తన ప్రతి బుసకు రోడ్లమీద దుమ్ము మేఘాలను రేపుతుంది. ట్రాక్టర్లు, లారీలు, బస్సులు లాంటివి దాటి వెళ్లేటప్పుడు కూడా వాటి వెనుక రోడ్డు కనిపించకుండా పోతుంది. తీవ్రమైన ఎండలకు నిప్పుల్లా కాలిన నేల మీది మట్టి పిండి పిండై, చిన్నగా నున్నటి పొడి రూపంలో ముక్కు నుంచి.............© 2017,www.logili.com All Rights Reserved.