వర్తమాన కవిత్వంలో బిక్కి కృష్ణ ఒక తుఫాను లాంటి కవి. బిక్కి కృష్ణ ఎంతటి ఉక్కు లాంటి వాడో అంతటి నవనీత హృదయుడు. కపటం లేనివాడు. మాటకు హృదయానికి ఎడంను తుడిచేసినవాడు.... మంచి కవి కాకుండా ఎలా వుంటాడు. బిక్కి కృష్ణ మంచి కవిత్వం కోసం నదులంటా.... కొండలంటా.... ఆకాశపు విదులంటా అన్వేషించే ఒక నిత్య యాత్రికుడు. 'వాన వెలిశాక....' అన్నాడు. ఆ వాన కవి హృదయంలో కురిసిందే. అది వెలిసిన తర్వాత విశదమైన ఆకాశంలోంచి వెలువడిన నిర్మలమైన కవితలివి.
- డా ఎన్. గోపి
కృష్ణ కవిత్వాన్ని గుర్రంతోనే పోల్చాలి. ఎందుకంటే అయన కవిత్వం ప్రాణం పరుగు. అయన కవిత్వ వాక్యాలు నడవవు. పరుగెత్తుతాయి. పాఠకుణ్ణి తరుముతాయి. లాగుతాయి. ఈ కవి వర్తమాన భారతదేశ సామజిక వాస్తవికతను పూలురాలిన చెట్టులాగా భావించి చెప్పాడు. 'నది తెల్లని ఇసుక వీణ తీగలపై అలల వేళ్ళు కదిలిస్తూ సంగీతం నేర్చుకుంటున్నది. ఇదొక దృశ్యం. దృశ్యం నాట్యయమానమైంది ఇక్కడ. ఇలాంటి దృశ్యాలు ఈ కావ్యంలో అనేకం వున్నాయి. కృష్ణ కవిత్వం చిక్కబడింది. భావుకత బలపడింది. కవి అంటే సామజిక వాస్తవికత మీద సైద్ధాంతిక తీర్పునిచ్చే న్యాయమూర్తి. ప్రపంచీకరణ పరిణామాలను కాలమార రంగురంగుల సిరాలలో చిత్రీకరించాడు బిక్కి కృష్ణ.
- డా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి - కృష్ణ బిక్కి