'మోయలేని బాధ్యతని మోయగలిగే వాళ్ళ నుంచి అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో లాగేసుకొని, మోసేయాలనుకుంటే కూలబడిపోతారు. మోయగలిగే బరువుని ఎత్తుకోవాలి. మనం మోయలేని బరువుని మోస్తున్న వాళ్ళను చూసి అభినందించాలి. కచ్చ పెంచుకోకూడదు. ఆ కచ్చే మనిషిని నిలువునా బతికుండగానే చంపేస్తుంది. బాధలకు, సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్ళకు బలవన్మరణం పరిష్కారం కాకూడదు.
మనిషి ప్రతిక్షణం ఆశాభావంతోటే బతకాలి. రేపేమవుతుందో అనే భయంతో వర్తమానాన్ని నాశనం చేసుకోవటం అవివేకం. నువ్వు గెలవాలనుకుంటే ముందు ఎదుటిమనిషి చెప్పేది విను.. నువ్వు ఓడిపోవాలనుకుంటే నీది మాత్రమే కరక్ట్ అని అవకాశం ఇవ్వకుండా అడ్డంగా వాదనకో, పోట్లాటకో దిగిపో.. విన్ విన్ సిట్యూవేషన్ అంటే నువ్వు గెలవాలి, అవతలవాళ్ళూ గెలవాలనుకున్నప్పుడు సహనంగా ఉండు, శ్రద్ధగా విను, సమన్వయంతో ఆలోచించు. ఒక సమస్యకు ఎప్పుడూ ఒక పరిష్కారమే కాదు ఎన్నో పరిష్కారాలుంటాయి.'
'మోయలేని బాధ్యతని మోయగలిగే వాళ్ళ నుంచి అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో లాగేసుకొని, మోసేయాలనుకుంటే కూలబడిపోతారు. మోయగలిగే బరువుని ఎత్తుకోవాలి. మనం మోయలేని బరువుని మోస్తున్న వాళ్ళను చూసి అభినందించాలి. కచ్చ పెంచుకోకూడదు. ఆ కచ్చే మనిషిని నిలువునా బతికుండగానే చంపేస్తుంది. బాధలకు, సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్ళకు బలవన్మరణం పరిష్కారం కాకూడదు. మనిషి ప్రతిక్షణం ఆశాభావంతోటే బతకాలి. రేపేమవుతుందో అనే భయంతో వర్తమానాన్ని నాశనం చేసుకోవటం అవివేకం. నువ్వు గెలవాలనుకుంటే ముందు ఎదుటిమనిషి చెప్పేది విను.. నువ్వు ఓడిపోవాలనుకుంటే నీది మాత్రమే కరక్ట్ అని అవకాశం ఇవ్వకుండా అడ్డంగా వాదనకో, పోట్లాటకో దిగిపో.. విన్ విన్ సిట్యూవేషన్ అంటే నువ్వు గెలవాలి, అవతలవాళ్ళూ గెలవాలనుకున్నప్పుడు సహనంగా ఉండు, శ్రద్ధగా విను, సమన్వయంతో ఆలోచించు. ఒక సమస్యకు ఎప్పుడూ ఒక పరిష్కారమే కాదు ఎన్నో పరిష్కారాలుంటాయి.'© 2017,www.logili.com All Rights Reserved.