లేడీ మూరాసాకి (జపనీస్)
ప్రపంచ సాహిత్యం లోనే తొలి నవల రాసిన రచయిత లేడీ మూరాసాకి. మంచులా గడ్డకట్టిన నా కలం సాగడం లేదు, నా మనోభావాలకు అది చిత్రిక పట్టడం లేదు - అంటూ తను రాయలేకపోతున్నానని దిగులు పడింది. ఒకానొక రోజున మూరాసాకి షీకీబు (Murasaki Shikibu). కానీ అంతలోనే తేరుకుంది. ఆమె కలం పరుగులు తీసింది. వెయ్యికి పైగా పుటలతో, మూడు సంపుటాల నవలను జపనీసు భాషకే కాదు, ప్రపంచ సాహిత్యానికి అందించింది.
అది క్రీ.శ.11వ శతాబ్దం . హేస్ఆన్ వంశం (Heian dynasty, 794-1185 A.D.) జపాను పరిపాలిస్తున్న రోజులు. అప్పటికి ఒక ప్రత్యేక భాషగా జపనీస్ పూరిగా | ఆకృతి దాల్చలేదు. జపనీస్లో కవిత్వం ఉన్నా, వచనం ఇంకా స్థిరపడలేదు; ఆదరణ అసలే లేదు. చైనీస్ ప్రభావం ఇంకా అంటిపెట్టుకునే ఉంది. జపనీస్ ఎక్కువగా మౌలిక భాషగానే ఉంది. లిఖిత రూపంలోకి వచ్చిన జపనీలో చైనా అక్షరాలు, చైనా లిపి ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో 'బాగా చదువుకున్నవాడు' అంటే ప్రాచీన చెనా భాషాసాహిత్యాల్లో పండితుడు అనే అర్థం. చైనా, జపాన్ల మధ్య నాలుగో శతాబి నుంచి ఏర్పడిన దౌత్య సంబంధాలు మొదట వ్యాపార వాణిజ్యాల కోసమే. కానీ అలా ప్రారంభమైన సంబంధం జపానుపై చైనా సాంస్కృతిక ప్రభావంగా మారడానికి రెండు శతాబ్దుల................
లేడీ మూరాసాకి (జపనీస్) ప్రపంచ సాహిత్యం లోనే తొలి నవల రాసిన రచయిత లేడీ మూరాసాకి. మంచులా గడ్డకట్టిన నా కలం సాగడం లేదు, నా మనోభావాలకు అది చిత్రిక పట్టడం లేదు - అంటూ తను రాయలేకపోతున్నానని దిగులు పడింది. ఒకానొక రోజున మూరాసాకి షీకీబు (Murasaki Shikibu). కానీ అంతలోనే తేరుకుంది. ఆమె కలం పరుగులు తీసింది. వెయ్యికి పైగా పుటలతో, మూడు సంపుటాల నవలను జపనీసు భాషకే కాదు, ప్రపంచ సాహిత్యానికి అందించింది. అది క్రీ.శ.11వ శతాబ్దం . హేస్ఆన్ వంశం (Heian dynasty, 794-1185 A.D.) జపాను పరిపాలిస్తున్న రోజులు. అప్పటికి ఒక ప్రత్యేక భాషగా జపనీస్ పూరిగా | ఆకృతి దాల్చలేదు. జపనీస్లో కవిత్వం ఉన్నా, వచనం ఇంకా స్థిరపడలేదు; ఆదరణ అసలే లేదు. చైనీస్ ప్రభావం ఇంకా అంటిపెట్టుకునే ఉంది. జపనీస్ ఎక్కువగా మౌలిక భాషగానే ఉంది. లిఖిత రూపంలోకి వచ్చిన జపనీలో చైనా అక్షరాలు, చైనా లిపి ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో 'బాగా చదువుకున్నవాడు' అంటే ప్రాచీన చెనా భాషాసాహిత్యాల్లో పండితుడు అనే అర్థం. చైనా, జపాన్ల మధ్య నాలుగో శతాబి నుంచి ఏర్పడిన దౌత్య సంబంధాలు మొదట వ్యాపార వాణిజ్యాల కోసమే. కానీ అలా ప్రారంభమైన సంబంధం జపానుపై చైనా సాంస్కృతిక ప్రభావంగా మారడానికి రెండు శతాబ్దుల................
© 2017,www.logili.com All Rights Reserved.