అభ్యుదయ రచయితల సంఘ సారథిగా, ఉద్యమకారుడిగా అనిసెట్టి జీవితాన్ని సమగ్రాంధ్ర సాహిత్యం 13వ సంపుట౦లో రాశారు ఆరుద్రగారు. దాన్ని సంకలనంలో ప్రచురించేందుకు అనుమతి౦చినందుకూ, అభ్యుదయ రచయితల సంఘ ఉపాధ్యక్షుడు డా.ఆవంత్స సోమసుందర్ చక్కని విపులమైన పీఠిక రాసినందుకూ, అనిసెట్టి కవితలను ప్రచురించడానికి అనుమతించిన అనిసెట్టి కుటుంబానికీ ధన్యవాదాలు. అలభ్యమైన అభ్యుదయ సాహిత్యాన్ని పాఠకులకు అందించడంలో ఎప్పటిలాగే కృషి సల్పుతామని హామీ ఇస్తూ అనిసెట్టి కవితా కదంబాన్ని మీ కందిస్తున్నాము. అనిసెట్టి తనే రాసుకున్న పీఠికలా ఉండే 'స్వీయచరిత్ర' నూ 'అగ్నివీణ' లో లేకున్నా జనం నాల్కల మీద బతికున్న "భయం బ్రతుకు భయం" అన్న గేయాన్ని 'అగ్నివీణ'కు ముందు చేరుస్తున్నాం. ఇక ఆదరించాల్సింది మీరే.
- ప్రచురణకర్తలు
అభ్యుదయ రచయితల సంఘ సారథిగా, ఉద్యమకారుడిగా అనిసెట్టి జీవితాన్ని సమగ్రాంధ్ర సాహిత్యం 13వ సంపుట౦లో రాశారు ఆరుద్రగారు. దాన్ని సంకలనంలో ప్రచురించేందుకు అనుమతి౦చినందుకూ, అభ్యుదయ రచయితల సంఘ ఉపాధ్యక్షుడు డా.ఆవంత్స సోమసుందర్ చక్కని విపులమైన పీఠిక రాసినందుకూ, అనిసెట్టి కవితలను ప్రచురించడానికి అనుమతించిన అనిసెట్టి కుటుంబానికీ ధన్యవాదాలు. అలభ్యమైన అభ్యుదయ సాహిత్యాన్ని పాఠకులకు అందించడంలో ఎప్పటిలాగే కృషి సల్పుతామని హామీ ఇస్తూ అనిసెట్టి కవితా కదంబాన్ని మీ కందిస్తున్నాము. అనిసెట్టి తనే రాసుకున్న పీఠికలా ఉండే 'స్వీయచరిత్ర' నూ 'అగ్నివీణ' లో లేకున్నా జనం నాల్కల మీద బతికున్న "భయం బ్రతుకు భయం" అన్న గేయాన్ని 'అగ్నివీణ'కు ముందు చేరుస్తున్నాం. ఇక ఆదరించాల్సింది మీరే. - ప్రచురణకర్తలు© 2017,www.logili.com All Rights Reserved.