మక్కి కి మక్కీ
పరీక్షలలో కాపీ కొట్టే వారికి ఇది వర్తిస్తుంది. అట్లనే ఇతరులను అనుకరించే వారికి కూడా. పరీక్షలో ఎదుటి విద్యార్థి జవాబులు రాస్తుంటే ఒక ఈగ వచ్చి ఆన్సర్ షీట్ పై వాలితే.. ఆ విద్యార్థికి కోపం వచ్చి టపీ మని దానిని కొడితే ఆ ఈగ పేపర్ కు అంటుకుని చచ్చిపోయిందట. వాడి వెనుక కూచుని కాపీ చేస్తున్న మరో విద్యార్థి తను కూడా ఒక ఈగను వెతికి చంపి తన జవాబు పత్రానికి అంటించాడట. మక్కీ అంటే ఈగ అని అర్థం. దీనికి సంబంధించిన మరో ఉర్దూ సామెత 'లిఖిర్ కే ఫకీర్'.
గదా ఘోడా దో భీ బరాబర్
సర్కారీ నౌకరీలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సర్కారీ దఫ్తర్ ల పనిచేసే వాడు, చెయ్యనివాడు ఇద్దరూ ఒక్కటేనని.. నెలాఖరుకు ఇద్దరికీ జీతం వస్తుందని ఈ సామెత సారాంశం. ఏం పరేషాన్ భై నేనేమో మా ఆఫీసుల గాడిద లెక్క చాకిరి చేస్తుంటే, నా పక్క సీటోడు సీటీలు బజాయించుకుంట బజార్లపొంట తిరుగుతాడు. మా ఆఫీసుల 'గదా ఘోడా దో భీ బరాబర్' అని అంగలార్చటం మనకు తెలిసిన సంగతే.
మక్కి కి మక్కీ పరీక్షలలో కాపీ కొట్టే వారికి ఇది వర్తిస్తుంది. అట్లనే ఇతరులను అనుకరించే వారికి కూడా. పరీక్షలో ఎదుటి విద్యార్థి జవాబులు రాస్తుంటే ఒక ఈగ వచ్చి ఆన్సర్ షీట్ పై వాలితే.. ఆ విద్యార్థికి కోపం వచ్చి టపీ మని దానిని కొడితే ఆ ఈగ పేపర్ కు అంటుకుని చచ్చిపోయిందట. వాడి వెనుక కూచుని కాపీ చేస్తున్న మరో విద్యార్థి తను కూడా ఒక ఈగను వెతికి చంపి తన జవాబు పత్రానికి అంటించాడట. మక్కీ అంటే ఈగ అని అర్థం. దీనికి సంబంధించిన మరో ఉర్దూ సామెత 'లిఖిర్ కే ఫకీర్'. గదా ఘోడా దో భీ బరాబర్ సర్కారీ నౌకరీలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సర్కారీ దఫ్తర్ ల పనిచేసే వాడు, చెయ్యనివాడు ఇద్దరూ ఒక్కటేనని.. నెలాఖరుకు ఇద్దరికీ జీతం వస్తుందని ఈ సామెత సారాంశం. ఏం పరేషాన్ భై నేనేమో మా ఆఫీసుల గాడిద లెక్క చాకిరి చేస్తుంటే, నా పక్క సీటోడు సీటీలు బజాయించుకుంట బజార్లపొంట తిరుగుతాడు. మా ఆఫీసుల 'గదా ఘోడా దో భీ బరాబర్' అని అంగలార్చటం మనకు తెలిసిన సంగతే.© 2017,www.logili.com All Rights Reserved.