భారతదేశంలో మైదాన ప్రాంతంలో జీవిస్తున్న ఆధునిక నాగరిక సమాజానికీ, నేటి సమాజం అనుభవిస్తున్న సాంకేతికపరమైన సౌకర్యాలకు, సంపాదకు, వివిధ పథకాల ప్రయోజనాలకు దూరంగా, ప్రకృతిని ఆరాధిస్తూ, కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డకోసం నిరంతరం శ్రమిస్తూ, వాటికోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితుల్లో, అన్ని విధాలా బాధలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్న అమాయకులు ఆదివాసీలు. తరతరాల పీడనని, దోపిడీలను, అణచివేతని అవమానాల్ని భరించలేని ఆదివాసీ ప్రజల్లో ప్రవేశించిన విప్లవాలకూ, తిరుగుబాటుకూ తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే తత్వానికి సాక్ష్యాలుగా వివిధ సాహిత్య ప్రక్రియలు వారి చేతుల్లోనే రూపుదిద్దుకున్నాయి.
అలాంటి రచనల్లో ఝార్ఖండ్ లోని ‘దుమాకా’కు చెందిన ఆదివాసీ యువ కవయిత్రి సుశ్రీ ‘నిర్మలా పుతుల్’ గారు సంథాలీ భాషలో రాసిన కవితా సంగ్రహం ‘నగాడే కీ తరః బజ్ తే శబ్ద్’ గా గౌరవనీయులు అశోక్ సింహ్ గారిచే హిందీలోకి తర్జుమా చేయబడింది. ‘నగారా వలే ధ్వనిస్తున్న శబ్దాలు’ గా డాక్టర్ వేమకోటి చంద్రశేఖరరావు గారిచే తెలుగు భాషలోకి అనువదించబడింది. తద్వారా ఆదివాసీ ప్రజలు, ముఖ్యంగా ‘స్త్రీ’ స్వాతంత్ర్య భావనల్ని, ఎదరొదల్ని, ఆశల్ని, ఆకాంక్షల్ని, ఆవేదనలను తెలుగు పాఠకులకు, పరిశోధకులకు పరిచయం చేయడం ఈ అనువాద కవితా సంపుటి యొక్క ముఖ్యోద్దేశంగా చెప్పవచ్చు. ఆదివాసీల జీవన చిత్రానికి అద్దం పట్టడం ఈ కవితా సంపుటి యొక్క విశేషం.