కవిత్వం నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో.. ఏది తక్షణ ప్రాధాన్యమో.. తాత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో.. ఎప్పుడూ గందరగోళమే. కొన్ని వాదనలతోనో.. కొన్ని విశ్వాసాలతోనో.. కొందరు కొన్ని కవితల్ని విపరీతంగా ప్రేమిస్తారు. కొందరికి అవి చాలా సామాన్యంగా పేలవంగా కనిపిస్తాయి. వందల ఏళ్ళు ముందుకుపోయి ఆలోచిస్తే వర్తమానాన్ని రికార్డు చేయలేవు. రిప్రజెంట్ చేయలేవు. ఈ కాలంలోనే ఇరుక్కుపోతే విశ్వాంతరాళంలో ఏ గోళం పైనా నీ చూపుల నీడలు వాలలేవు.
అందుకే కవిత్వం నాకో మాయ వంతెన. మాయ దీపం. మాయ రూపం. మాయ చూపు. మాయ నవ్వు. మాయ కౌగిలి. మాయ ఊయల. మాయ శవపేటిక. ఈ మాయామేయ చలచ్చల వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని కవిత్వానికి వస్తే నాకో చూపుంది. దానికెంత స్పష్టత ఉందో చెప్పలేను కాని.. చూడాల్సిందేదో చెప్పగలను. రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు. అది నా జీవన వ్యాపకం కాబట్టి.
నా అంతర్ముఖీనత్వం, వయసురీత్యా అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్విక ధోరణులు, శిల్పం మీద మోజు నన్ను మరో వైపుకు నెడుతూనే ఉంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే.. పలకరింపులే.. పలవరింతలే ఈ కవితలు.
- ప్రసాదమూర్తి
కవిత్వం నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో.. ఏది తక్షణ ప్రాధాన్యమో.. తాత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో.. ఎప్పుడూ గందరగోళమే. కొన్ని వాదనలతోనో.. కొన్ని విశ్వాసాలతోనో.. కొందరు కొన్ని కవితల్ని విపరీతంగా ప్రేమిస్తారు. కొందరికి అవి చాలా సామాన్యంగా పేలవంగా కనిపిస్తాయి. వందల ఏళ్ళు ముందుకుపోయి ఆలోచిస్తే వర్తమానాన్ని రికార్డు చేయలేవు. రిప్రజెంట్ చేయలేవు. ఈ కాలంలోనే ఇరుక్కుపోతే విశ్వాంతరాళంలో ఏ గోళం పైనా నీ చూపుల నీడలు వాలలేవు. అందుకే కవిత్వం నాకో మాయ వంతెన. మాయ దీపం. మాయ రూపం. మాయ చూపు. మాయ నవ్వు. మాయ కౌగిలి. మాయ ఊయల. మాయ శవపేటిక. ఈ మాయామేయ చలచ్చల వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని కవిత్వానికి వస్తే నాకో చూపుంది. దానికెంత స్పష్టత ఉందో చెప్పలేను కాని.. చూడాల్సిందేదో చెప్పగలను. రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు. అది నా జీవన వ్యాపకం కాబట్టి. నా అంతర్ముఖీనత్వం, వయసురీత్యా అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్విక ధోరణులు, శిల్పం మీద మోజు నన్ను మరో వైపుకు నెడుతూనే ఉంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే.. పలకరింపులే.. పలవరింతలే ఈ కవితలు. - ప్రసాదమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.