లోకంలో భగవద్భక్తి లేని వ్యక్తి ఉండడు అనటం అతిశయోక్తికాదు. ఎందుకంటే, మానవ జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. అందువల్ల కష్టం వచ్చినపుడల్లా భగవంతుణ్ణి తలుచుకోవటం, మరీ కష్టమెక్కువైనపుడు దేవుణి నిష్టూరంగా ప్రశ్నించటమే కాదు, దూషించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే "ఎందుకీ శిక్ష ఏమిటి నీ కక్ష! " అనే గ్రంధంలోని సారంశం. దీనికి తార్కాణంగా ఒకటి, రెండు ఉదాహరణల్ని చూడండి.
నువ్వే నేనంటావు
నేనే నువ్వంటావు
అద్వేత మంటావు
సర్వం నీవైతే భగవాన్...
నా చేత తప్పుఎందుకు చేయిస్తావు ? అంటాడు.
నన్ను పుట్టించి, నీవు పెద్ద తప్పు చేసావ్
నీతిలేని వాడనని, నోరు పారేసుకుంటావా?
పుట్టించే ముందు తెలియదా ?
దేవుడి మాన్యం తాకట్టు పెడతాడని,
దేబిరించి దేశాన్ని అమ్ముకుంటాడని,
సేద తీర్చే చంద్రుని నెత్తిన కాలుమోపుతాడని
కన్నతల్లి కన్నీటితో జలకాలాడతాడని
కట్టుకున్న ఇల్లాల్ని బేరం పెడతాడని
గురుశక్తిని ఎంత గడతాడని
ప్రకృతి శక్తులతో వ్యాపారం చేస్తాడని
పగ ప్రతీకారాలకు కొమ్ము కాస్తాడని
కాకపోతే ఏమిటి తండ్రీ ఈ గందరగోళం"
- డా పిన్ని చక్రపాణి
లోకంలో భగవద్భక్తి లేని వ్యక్తి ఉండడు అనటం అతిశయోక్తికాదు. ఎందుకంటే, మానవ జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. అందువల్ల కష్టం వచ్చినపుడల్లా భగవంతుణ్ణి తలుచుకోవటం, మరీ కష్టమెక్కువైనపుడు దేవుణి నిష్టూరంగా ప్రశ్నించటమే కాదు, దూషించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే "ఎందుకీ శిక్ష ఏమిటి నీ కక్ష! " అనే గ్రంధంలోని సారంశం. దీనికి తార్కాణంగా ఒకటి, రెండు ఉదాహరణల్ని చూడండి. నువ్వే నేనంటావు నేనే నువ్వంటావు అద్వేత మంటావు సర్వం నీవైతే భగవాన్... నా చేత తప్పుఎందుకు చేయిస్తావు ? అంటాడు. నన్ను పుట్టించి, నీవు పెద్ద తప్పు చేసావ్ నీతిలేని వాడనని, నోరు పారేసుకుంటావా? పుట్టించే ముందు తెలియదా ? దేవుడి మాన్యం తాకట్టు పెడతాడని, దేబిరించి దేశాన్ని అమ్ముకుంటాడని, సేద తీర్చే చంద్రుని నెత్తిన కాలుమోపుతాడని కన్నతల్లి కన్నీటితో జలకాలాడతాడని కట్టుకున్న ఇల్లాల్ని బేరం పెడతాడని గురుశక్తిని ఎంత గడతాడని ప్రకృతి శక్తులతో వ్యాపారం చేస్తాడని పగ ప్రతీకారాలకు కొమ్ము కాస్తాడని కాకపోతే ఏమిటి తండ్రీ ఈ గందరగోళం" - డా పిన్ని చక్రపాణి© 2017,www.logili.com All Rights Reserved.