తెలుగు కవిత్వపు ఆస్థిత పరిభాషను పదేపదే సరికొత్తగా కనుగొనే క్రమంలో ఆ పలుకుబడి ఏ విధంగా అనేకానేక హోయల్ని వయ్యారాల్ని పలికిస్తున్నదో గమనిస్తూ 14 ఏళ్లుగా ‘కవిత’ వార్షిక సంకలనాల ప్రస్థానం కొనసాగుతుంది. ఆ అక్షరాల సోగాసునీ సోయగాల్ని చూస్తూ అబ్బురపడుతూ, ఆనందపడుతూ నిరంతరంగా ‘మే’ దే నాడు కవిత్వం పండుగ నిర్వహిస్తోంది. 14 ఎల్లా తరువాత కూడా తొలినాటి పసితనపు ఛాయలతోనే మెత్తటి హృదయాలుగల కవితల్ని ఒక పుస్తకంగా తీసుకువచ్చి ‘కవిత 2017’ గా మీముందు పెడుతున్నాం.
కాలం నిండా కత్తిపోట్లు. ఇంకా కులం మోరెగరెసిన ఊళ్లు, తెలుగుబల్లను మూసేసిన జీవోలు, శవాల్ని సుదూరతీరాలకు మోసుకేల్లల్సిన స్థితి, మాట అసహనం లాంటి రకరకాల గాయాల బారినపడ్డ కాలం యొక్క దృశ్యాల్ని కవిత్వీకరించిన కవుల అంతరంగాల్ని ఆవిష్కరించిన పుస్తకం ఇది. భావాల్ని, భావనాబలాల్ని బేరీజువేస్తున్న తూనిక రాళ్ళని తోసిరాజని కొత్త వాక్యాలు నిర్మాణమౌతున్న సందర్భమిది. ఆ సందర్భాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నమే ఈ కవితా సంపుటి. రూపకీకరణకి భాష తన హద్దుల్ని సైతం చెరిపేస్తున్న కవిత్వ సంకలనాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.