మిత్రుడు శ్రీనివాస్ సమాంతర ఛాయలు అనే తన తొలి కవితా సంపుటిని, sixth ఎలిమెంట్ అనే తన ద్వితీయ కవితా సంపుటిని, తపస్సిద్ధి ఫలితమా అన్నట్టు అద్భుతంగా రచించాడు. ఎక్కడైనా పిచ్చిగాలులు పలకరిస్తే తల ఒగ్గి కైవశమయ్యే స్థితికి జారుతున్న తనని తాను కాపాడుకొంటూనే వున్నాడు. ఈ ఉత్తమ లక్షణమే నా శ్రమను అతని కోసం వినియోగించ కుతూహలపడ్డాను. పొరపాటు, నా శ్రమను అతనికివ్వడమేమిటి? తెలుగు సాహిత్య ప్రమేయంతోనే నేనయినా, అతనయినా ఈ వాక్యాలు వ్రాస్తున్న మన్మధరావయినా నియమితులమై ఉన్నాం. ఇటీవల కమిట్ మెంట్ అంటున్నాం. అటువంటి ప్రాణాంతకమయిన నియమం కాదిది. ఉల్లాసోల్లలిత మనోజ్ఞ రంగవల్లి కలలో వెర్రి కూర్చుని మంచి కవిత్వం ఆరగించడానికి నేనే కాదు, అందరమూ ఎంతో సంతోషంతో అంగీకరిస్తాము - అట్టి శారద శోభ కోసమే మనమందరం ఆయత్తమవుదాం.
- ఆవంత్స సోమసుందర్