శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు.
ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు.
“మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?" అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు.
వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు.
శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు.
“నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ,
పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు.
ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా,
పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన
శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు. ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు. “మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?" అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు. వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు. శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు. “నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ, పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు. ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా, పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన
© 2017,www.logili.com All Rights Reserved.