దీపాచంద్రన్ రామ్ చక్కని కవయిత్రి, చిత్రకారిణి. ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల చిత్రాలను, అల్లికలను, ముగ్గులను అధ్యయనం చేసిన ఆమె తన చిత్రాలలో వాటి సంక్లిష్టతను, సౌందర్యాన్ని పొందుపరచినట్లే తన కవితలలో కూడా భావగాంభీర్యాన్ని, మనోహరమైన శైలిని, లేతకొబ్బరి తియ్యదనాన్ని మార్మికతను ఇమిడ్చి మురిపిస్తుంది. .
కవిత్వం, సంగీతం, చిత్రకళలలో చిన్నప్పటి నుండి ఇష్టం ఉన్న దీపారామ్ కెమిస్ట్రీలో పిహెచ్.డి. చేసి డీకిన్ కాలేజిలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. అనేక అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శించబడినాయి. ఆమె కవితలు ఎన్నో కవితా సంకలనాలలో పొందుపరచ బడినాయి.
The Inner Quiet పేరిట ఆమె వెలువరించిన కవితాసంపుటిని నాలోపలి నిశ్శబం'గా అనువదించి తెలుగు సాహితీలోకానికి పరిచయం చేస్తున్నది. సృజనలోకం. సాహితీమిత్రులు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని గాఢంగా విశ్వసిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్ - 4
దీపాచంద్రన్ రామ్ చక్కని కవయిత్రి, చిత్రకారిణి. ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల చిత్రాలను, అల్లికలను, ముగ్గులను అధ్యయనం చేసిన ఆమె తన చిత్రాలలో వాటి సంక్లిష్టతను, సౌందర్యాన్ని పొందుపరచినట్లే తన కవితలలో కూడా భావగాంభీర్యాన్ని, మనోహరమైన శైలిని, లేతకొబ్బరి తియ్యదనాన్ని మార్మికతను ఇమిడ్చి మురిపిస్తుంది. . కవిత్వం, సంగీతం, చిత్రకళలలో చిన్నప్పటి నుండి ఇష్టం ఉన్న దీపారామ్ కెమిస్ట్రీలో పిహెచ్.డి. చేసి డీకిన్ కాలేజిలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. అనేక అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శించబడినాయి. ఆమె కవితలు ఎన్నో కవితా సంకలనాలలో పొందుపరచ బడినాయి. The Inner Quiet పేరిట ఆమె వెలువరించిన కవితాసంపుటిని నాలోపలి నిశ్శబం'గా అనువదించి తెలుగు సాహితీలోకానికి పరిచయం చేస్తున్నది. సృజనలోకం. సాహితీమిత్రులు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని గాఢంగా విశ్వసిస్తూ... - డాక్టర్ లంకా శివరామప్రసాద్ - 4© 2017,www.logili.com All Rights Reserved.