ఈ రచయిత్రి కబీరు, చైతన్యులవంటి భగవద్భక్తులవలె తన ఆవేశానికి తానే తట్టుకోలేని భావావేశం కలది. ఈ రచనలు చదువుతున్నంత సేపూ, నా మట్టుకు నాకు, ఒక ఉప్పెన గాలిలో చిక్కున్నట్లే అయింది. ఏ క్షణం ఈ ఉద్వేగప్రవాహం తన అవధులను తానే చేధించుకొని ఏ పొట్టలు పోసుకున్న పైరుల మీదకు పరవళ్ళు తొక్కుతుందో, అని భయమే వేసింది. ఈమె భావావేశంలో అంత తీవ్రతవుంది. పైగా తన భావావేశానికి ఈమె ముసుగులు వెయ్యదు. అందాలు తొడగదు. ఉబికిన ఉద్వేగాన్ని ఉబికినట్లే పొందుపరుస్తుంది. ఉండిపోనిస్తుంది.
- గోపీచంద్
జీవితకాలం ఊహించుకుంటూ, ఊహల్లో అన్వేషించుకుంటూ ఉండే నిర్వికారశక్తి కవి. క్షణక్షణమొక కొత్త రూపాన్ని ధరిస్తూ, ఆయా రూపాలకు తగినభావాలతో, ప్రవర్తనలతో నన్ను స్పందింపచేసే 'బోసికుర్చీ'యే చుట్టూవున్న ప్రపంచం. ఇవన్నీ నన్ను నేను గుర్తించుకునే ప్రయత్నంలోని నా ఒంటరిక్షణాలు. తెలియని ఏ శక్తి కోసమో, అందని ఏ అద్వితీయత కోసమో లోపలా, వెలుపలా అన్వేషణకు వేసుకున్న బాట నా ఈ 'కరిగిపోయే కలలు'.
- రమాదేవి
ఈ రచయిత్రి కబీరు, చైతన్యులవంటి భగవద్భక్తులవలె తన ఆవేశానికి తానే తట్టుకోలేని భావావేశం కలది. ఈ రచనలు చదువుతున్నంత సేపూ, నా మట్టుకు నాకు, ఒక ఉప్పెన గాలిలో చిక్కున్నట్లే అయింది. ఏ క్షణం ఈ ఉద్వేగప్రవాహం తన అవధులను తానే చేధించుకొని ఏ పొట్టలు పోసుకున్న పైరుల మీదకు పరవళ్ళు తొక్కుతుందో, అని భయమే వేసింది. ఈమె భావావేశంలో అంత తీవ్రతవుంది. పైగా తన భావావేశానికి ఈమె ముసుగులు వెయ్యదు. అందాలు తొడగదు. ఉబికిన ఉద్వేగాన్ని ఉబికినట్లే పొందుపరుస్తుంది. ఉండిపోనిస్తుంది. - గోపీచంద్ జీవితకాలం ఊహించుకుంటూ, ఊహల్లో అన్వేషించుకుంటూ ఉండే నిర్వికారశక్తి కవి. క్షణక్షణమొక కొత్త రూపాన్ని ధరిస్తూ, ఆయా రూపాలకు తగినభావాలతో, ప్రవర్తనలతో నన్ను స్పందింపచేసే 'బోసికుర్చీ'యే చుట్టూవున్న ప్రపంచం. ఇవన్నీ నన్ను నేను గుర్తించుకునే ప్రయత్నంలోని నా ఒంటరిక్షణాలు. తెలియని ఏ శక్తి కోసమో, అందని ఏ అద్వితీయత కోసమో లోపలా, వెలుపలా అన్వేషణకు వేసుకున్న బాట నా ఈ 'కరిగిపోయే కలలు'. - రమాదేవి© 2017,www.logili.com All Rights Reserved.