" ఒకసారి మళ్ళీ చెప్పండి " అన్నాడు డాక్టర్ కుమార్ చాలా ఆశ్చర్యంగా.. విభ్రమంతో.. చిత్రంగా ఎదుట కూర్చుని ఉన్న ఆ పెద్దమనిషి ముఖంలోకి చూస్తూ.
ఆ పెద్దాయన ఏమీ చెప్పలేదు. సూటిగా డాక్టర్ కళ్ళలోకి ఓ లిప్తకాలం చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడౌతూండగా.,
" ఐతే మీరు మనుషులను ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు.. యామై కరక్ట్.? " అన్నాడు డాక్టర్ కుమార్.. ప్రసిద్ధ సైకియాట్రిస్ట్. గత ముప్ఫై ఏళ్లుగా వేలమంది మానసిక రోగులతో సహవాసం చేస్తూ ఆ వృత్తిలో ఉన్నతుడిగా గుర్తించబడి రాష్ట్రపతి అవార్డ్ పొందినవాడు. ఆయన కన్సల్టేషన్ ఫీ ఐదువందల రూపాయలు. రోజుకు ఇరవై మంది పేషంట్స్ ను మాత్రమే చూస్తాడు. అప్పాంట్మెంట్ దొరకడం కష్టం.
ఉహూ.. కాదు చాలా స్పష్టమైన సమాధానం.
మరి.?
" నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను ”
64
ఓ.. మనుషుల్ని ప్రేమించే శక్తిని కోల్పోవడం కాదు.. అసలు మనుషుల్నే ప్రేమించలేకపోతున్నారు" అని లోలోపల సన్నగా.. తనలోతానుగా.. కొద్దిగా చికాగ్గా.. అసహనంగా గొణుక్కుంటుండగా.,.................................
లోపలి ఖాళీ " ఒకసారి మళ్ళీ చెప్పండి " అన్నాడు డాక్టర్ కుమార్ చాలా ఆశ్చర్యంగా.. విభ్రమంతో.. చిత్రంగా ఎదుట కూర్చుని ఉన్న ఆ పెద్దమనిషి ముఖంలోకి చూస్తూ. ఆ పెద్దాయన ఏమీ చెప్పలేదు. సూటిగా డాక్టర్ కళ్ళలోకి ఓ లిప్తకాలం చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడౌతూండగా., " ఐతే మీరు మనుషులను ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు.. యామై కరక్ట్.? " అన్నాడు డాక్టర్ కుమార్.. ప్రసిద్ధ సైకియాట్రిస్ట్. గత ముప్ఫై ఏళ్లుగా వేలమంది మానసిక రోగులతో సహవాసం చేస్తూ ఆ వృత్తిలో ఉన్నతుడిగా గుర్తించబడి రాష్ట్రపతి అవార్డ్ పొందినవాడు. ఆయన కన్సల్టేషన్ ఫీ ఐదువందల రూపాయలు. రోజుకు ఇరవై మంది పేషంట్స్ ను మాత్రమే చూస్తాడు. అప్పాంట్మెంట్ దొరకడం కష్టం. ఉహూ.. కాదు చాలా స్పష్టమైన సమాధానం. మరి.? " నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను ” 64 ఓ.. మనుషుల్ని ప్రేమించే శక్తిని కోల్పోవడం కాదు.. అసలు మనుషుల్నే ప్రేమించలేకపోతున్నారు" అని లోలోపల సన్నగా.. తనలోతానుగా.. కొద్దిగా చికాగ్గా.. అసహనంగా గొణుక్కుంటుండగా.,.................................© 2017,www.logili.com All Rights Reserved.