ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు జస్టిస్ బి. చంద్రకుమార్ అనేక సాహిత్య సాంస్కృతిక సభలో పాల్గొని తమ వక్తృత్వ నిపుణతను ఆవిష్కరిస్తూ ఉన్నారు.
ఈ గ్రంథంతో చంద్రకుమార్ గారు కవిచంద్రులుగా తమ ప్రతిభాచంద్రికలను ప్రసరిస్తున్నారు.
'నా వైపు చూసేసరికి' అనే కవిత సరళ రచనలో ప్రగాఢ కవితాభివ్యక్తిని పొదుగుతుంది. ఆ కవితలోని పంక్తులివి.
"నీ కోసం నేను వచ్చాను
నిన్ను పలకరించాను
నీలో ఏ స్పందన కనిపించలేదు
కాసేపు చూసి వెళ్ళిపోయాను
నీలో స్పందన వచ్చి
నీవు నావైపు చూసేసరికి
నీకు అందనంత దూరం
వెళ్ళిపోయాను."
జయాపజయాలను గురించి ఒక కవితలో చంద్రకుమార్ గారు ఇలా అంటారు.
"విజయం సాధించానని
విర్ర వీగుతున్నావా
విజయం పక్కనే
అపజయం పొందివుందనే
విషయం మరిచిపోయావా
అపజయం పొందానని
అల్లాడిపోతున్నావా
విజయానికి మెట్లు
పక్కనే ఉన్నాయి చూడు"
జయాపజయాలు యాద్రుచికంగా సంభవిస్తుంటాయి. గెలిచినప్పుడు పొంగిపోవద్దు. ఓడినప్పుడు కు౦గిపోవద్దని చంద్రకుమార్ గారు చెప్తున్నారు.
ఉదాహరణయోగ్యంగా వున్నా అనేక కవితాత్మక పంక్తులు ఈ కవితలలో ఉన్నాయి. ఈ సంపుటి రూపకర్త బి.చంద్రకుమార్ గారికి నా హార్ధికాభినందనలు తెలియజేస్తున్నాను.
- డా. సి. నారాయణరెడ్డి
ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు జస్టిస్ బి. చంద్రకుమార్ అనేక సాహిత్య సాంస్కృతిక సభలో పాల్గొని తమ వక్తృత్వ నిపుణతను ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ గ్రంథంతో చంద్రకుమార్ గారు కవిచంద్రులుగా తమ ప్రతిభాచంద్రికలను ప్రసరిస్తున్నారు. 'నా వైపు చూసేసరికి' అనే కవిత సరళ రచనలో ప్రగాఢ కవితాభివ్యక్తిని పొదుగుతుంది. ఆ కవితలోని పంక్తులివి. "నీ కోసం నేను వచ్చాను నిన్ను పలకరించాను నీలో ఏ స్పందన కనిపించలేదు కాసేపు చూసి వెళ్ళిపోయాను నీలో స్పందన వచ్చి నీవు నావైపు చూసేసరికి నీకు అందనంత దూరం వెళ్ళిపోయాను." జయాపజయాలను గురించి ఒక కవితలో చంద్రకుమార్ గారు ఇలా అంటారు. "విజయం సాధించానని విర్ర వీగుతున్నావా విజయం పక్కనే అపజయం పొందివుందనే విషయం మరిచిపోయావా అపజయం పొందానని అల్లాడిపోతున్నావా విజయానికి మెట్లు పక్కనే ఉన్నాయి చూడు" జయాపజయాలు యాద్రుచికంగా సంభవిస్తుంటాయి. గెలిచినప్పుడు పొంగిపోవద్దు. ఓడినప్పుడు కు౦గిపోవద్దని చంద్రకుమార్ గారు చెప్తున్నారు. ఉదాహరణయోగ్యంగా వున్నా అనేక కవితాత్మక పంక్తులు ఈ కవితలలో ఉన్నాయి. ఈ సంపుటి రూపకర్త బి.చంద్రకుమార్ గారికి నా హార్ధికాభినందనలు తెలియజేస్తున్నాను. - డా. సి. నారాయణరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.