నన్నయకు బాగా ముందే తెలుగులో పద్యముందని తెలియజెప్పిన శ్రీ జయంతి రామయ్య పంతులు గారు తెలియని తెలుగు చరిత్రకారులు శాసన పరిశోధకులు సాహితి మూర్తులు వుండరంటే అతిశయోక్తి కాదు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో తెలుగు పద్యాలున్నాయని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయనే. శాసనాలను సేకరించి పరిష్కరించి దక్షిణభారత శాసనసంపుటి పేరిట ప్రచురించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏర్పాటులో కీలకపాత్ర పోషించటమేకాక ఎన్నో శిలా శాసనాలను ఆ సంస్థ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేశారు. తనకున్న ఆసక్తి కొద్దీ అనేక శాసనాల నాకళ్ళను ముందేసుకుని వాటిలోని పద్యాలనూ గుర్తించి గణ విభజన చేసి ఛందస్సుతో పాటు రెండు భాగాలుగా 'శాసనపద్యమంజరి' అనే పుస్తకాలను ప్రచురించి తెలుగు చారిత్రక సాహిత్య జగత్తుకు ఎనలేని సేవ చేశారు.
1930,1937, సంవత్సరాల్లో వరుసగా జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరి మొదటి రెండు భాగాలూ ముద్రించబడి ప్రజల మన్ననలు పొందాయి. ఆ పుస్తకాలు ఇపుడు అందుబాటులో లేనందువల్ల ఈతరం పరిశోధకులకు అందించాలనే ఉద్దేశంతో పురావస్తు పరిశోధకులు కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ & అమరావతి సీఈవో, డా ఈమని శివనాగిరెడ్డి - స్థపతి కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డా జి. వి. పూర్ణచందు శాసన పరిశోధకులు డా కొండా శ్రీనివాసులు ఈ పుస్తక పునర్ముద్రణకు పూనుకోవటం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను.
- డా. ఈమని శివనాగిరెడ్డి - స్థపతి
డా. కొండా శ్రీనివాసులు
డా. జి. వి. పూర్ణచందు

Features
: Sasana Padyamanjari
: Dr G V Purnachandu Dr Konda Srinivasulu Dr Emani Sivanagireddy